OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మాస్ మహారాజ్ రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతి రాజు డెబ్యూ సినిమా ఇది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు ముస్తాబైంది.

మాస్ మహారాజా రవితేజ ఇటీవలే ఇరుముడి సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాంటి రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. రవితేజ తమ్ముడు, నటుడు రఘు రాజు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘మారెమ్మ’. తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్ కు ముందు ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేయడంతో మారెమ్మపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజైన మారెమ్మ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. దర్శకుడు మంచాల నాగరాజ్ తీసుకున్న స్టోరీ మంచిదైనా దానిని ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడని నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో మారెమ్మ సినిమా కొద్ది రోజులకే థియేటర్లలో నుంచి మాయమైపోయింది. ఇప్పుడీ రూరల్ యాక్షన్ డ్రామా ఓటీటీలోకి రానుంది. మారెమ్మ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం నుంచే మారెమ్మ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించిందికాగా ఇదే అక్టోబర్ 09వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ మారెమ్మ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
మారెమ్మ సినిమా విషయానికి వస్తే.. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాధవ్ భూపతి రాజు సరసన దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. అలాగే సీనియర్ హీరో వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి, విప్రాదీప్ దత్తా ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని మారెమ్మ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆహా ఓటీటీలో మారెమ్మ సినిమా స్ట్రీమింగ్..
In the heart of rural Telangana, every belief has a story… and every story has a turning point. 👀
#Maremma premieres from Oct 9 on Aha! https://t.co/f8g8iUF3Yj
— ahavideoin (@ahavideoIN) October 6, 2026
మారెమ్మ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




