ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?

ముంబయి: దక్షిణాదిలో సూపర్‌హిట్‌ సిరీస్‌గా నిలిచిన ‘కాంచన’ ఇప్పుడు బాలివుడ్‌లోనూ సందడి చేయబోతోంది. ఈ క్రేజీ హర్రర్ సిరీస్‌కు ఆద్యుడైన రాఘవా లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్‌’  టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమా […]

ఫస్ట్ లుక్ అదిరిపోయింది..పుల్ పిక్చర్ ఎలా ఉండబోతోందో?
Ram Naramaneni

|

May 18, 2019 | 3:19 PM

ముంబయి: దక్షిణాదిలో సూపర్‌హిట్‌ సిరీస్‌గా నిలిచిన ‘కాంచన’ ఇప్పుడు బాలివుడ్‌లోనూ సందడి చేయబోతోంది. ఈ క్రేజీ హర్రర్ సిరీస్‌కు ఆద్యుడైన రాఘవా లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మీ బాంబ్‌’  టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది.  ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఫర్హాద్‌ సామ్‌జీ సినిమాకు రచయితగా పనిచేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 5న సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్‌లో అక్షయ్‌ కళ్లకు కాటుక పెట్టుకుంటూ కనిపించారు. ఓ చక్కటి కథను మీకు చూపించబోతున్నాం అంటూ అక్షయ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. అదే విధంగా కియారా ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన తర్వాతి ప్రాజెక్టు కోసం అక్షయ్‌తో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu