దివంగత హీరో చిరంజీవి సర్జా కొడుకు వీడియోను షేర్ చేసిన మేఘనా.. ‘జూనియర్ సీ’ అంటూ ఎమోషనల్ మేసేజ్..
దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన కొడుకును మొదటి సారి ప్రపంచానికి పరిచయం చేసింది. 'జూనియర్ చిరు' అని

దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన కొడుకును మొదటి సారి ప్రపంచానికి పరిచయం చేసింది. ‘జూనియర్ చిరు’ అని పిలువబడే వారి కొడుకు వీడియోను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో జూనియర్ సీ.. ఎంతో ముద్దుగా కనిపిస్తున్నాడు. కొడుకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పటివరకు మేఘన తన వారి అబ్బాయి పేరు మాత్రం ఎప్పుడూ ప్రస్తావించలేదు.
మేఘన ప్రెగ్నేంట్గా సమయంలోనే ఆమె భర్త చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండె పోటుతో మరణించారు. ఆ తర్వాత మేఘన ఎక్కువగా సోషల్ మీడియాలకు రాలేదు. గతంలో తనకు శ్రీమంతం చేసిన వీడియోను మాత్రం తన కుటుంబ సభ్యులు నెట్టింట్లో షేర్ చేశారు. అక్టోబర్ 22న మేఘన అబ్బాయికి జన్మనిచ్చింది. తర్వాత ఆ బాబుకు సంబంధించిన విషయాలను అటు మేఘన కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ వెల్లడించలేదు. తాజాగా తన బాబుకు సంబంధించిన వీడియోను మేఘన షేర్ చేసింది.
“మా లిటిల్ ప్రిన్స్ పరిచయం. నేను పుట్టక ముందే మీరు నన్ను ప్రేమించారు. ఇప్పుడు మీరు మొదటి సారి కలిసినప్పుడు ఏం చేసారో.. నేను చేయాలనుకుంటున్నాను. అమ్మ మరియు అప్పాపై చాలా ప్రేమ, సపోర్ట్ నాకు అందించినందుకు చాలా థ్యాంక్స్. మీరు, కుటుంబం మొత్తం ఎక్కువగా ప్రేమిస్తున్నారు. లవ్ యూ ఆల్” అంటూ పేర్కోంది మేఘన. ఈ వీడియోకు ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram
Also Read:
John Abraham : షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం.. రక్తం తుడుచుకుంటున్న వీడియో వైరల్..




