AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి చేసుకోబోతున్న రియల్ స్టార్ పెద్ద కొడుకు..

దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Tollywood : శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెళ్లి చేసుకోబోతున్న రియల్ స్టార్ పెద్ద కొడుకు..
Srihari Family
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2026 | 7:19 PM

Share

టాలీవుడ్‌లో రియల్ హీరోగా, షేర్ ఖాన్ గా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగా, నటుడిగా, విలన్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సమయంలోనే ఆయన ఆకస్మిక మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికీ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పలువురు సినీ ప్రముఖులు ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీహరి తనయులు సైతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రీహరి కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రీహరి, డిస్కో శాంతి దంపతుల పెద్ద కుమారుడైన శశాంక్ శ్రీహరి త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ శుభసందర్భానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

శ్రీహరి పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి నిశ్చితార్థ వేడుక ఫిబ్రవరి 20వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సంజన అనే అమ్మాయితో శశాంక్ నిశ్చితార్థం నిశ్చయమైనట్లు సమాచారం. ఇటు కుటుంబ సభ్యులు, అటు అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీహరి అకాల మరణం తర్వాత కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్న డిస్కో శాంతి, తమ కుమారుడి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

శ్రీహరి కుటుంబంతో తెలుగు సినీ పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. నటుడిగా శ్రీహరి ఎంతోమందికి సహాయం చేయడమే కాకుండా, ఇండస్ట్రీలో ఒక మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు, నటీనటులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీహరి ఇంట చాలా కాలం తర్వాత శుభకార్యం జరుగుతుండటంతో మెగా అభిమానులు, శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల వేదికగా శశాంక్, సంజన జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

Follow Us