బాక్సాఫీస్‌ని కొల్లగొడుతున్న ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’
అవెంజర్స్ ఎండ్ గేమ్… ఈ చిత్రం.. రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటికే మన దేశంలో 25 లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బాహుబలి-2 కోసం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోగా.. అవెంజర్స్ ఎండ్ గేమ్‌కు అదే రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం విశేషం. గత హాలీవుడ్ చిత్రాలకు సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం కోసం బుక్ మై షోలోనూ ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ సినిమా […]

అవెంజర్స్ ఎండ్ గేమ్… ఈ చిత్రం.. రిలీజ్‌కు ముందే రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటికే మన దేశంలో 25 లక్షల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బాహుబలి-2 కోసం 33 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోగా.. అవెంజర్స్ ఎండ్ గేమ్‌కు అదే రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం విశేషం. గత హాలీవుడ్ చిత్రాలకు సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం కోసం బుక్ మై షోలోనూ ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకున్నారు.
ఈ సినిమా ఆసియా, యూరప్‌ల్లోని కొన్ని దేశాల్లో ఈ చిత్రం బుధవారమే విడుదల కాగా భారత్, అమెరికా, కెనడాల్లో శుక్రవారం రిలీజయ్యింది. ఈ మూవీ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల కావడంతో సునామీ సృష్టిస్తోంది. చైనాలో ఈ చిత్రం 108 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఆ దేశంలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. భారత్, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో విడుదల కాకముందే.. ఈ చిత్రం 170 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది దాదాపు రూ.1190 కోట్లకు సమానం. తొలి వారాంతానికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 850 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి ‘మార్వెలస్’ అని ట్వీట్ చేశారు.
#OneWordReview…#AvengersEndgame: MARVEL-OUS.Rating: ⭐️⭐️⭐️⭐️⭐️The hugely-anticipated film exceeds the humongous expectations… Emotional, humorous, lots and lots of surprises in store… Get ready for a Tsunami at the Boxoffice. #AvengersEndgameReview pic.twitter.com/DW6SQNiEFq
— taran adarsh (@taran_adarsh) April 25, 2019



