Koratala Siva: దిల్ రాజుకు షాక్ ఇచ్చిన కొరటాల..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలే కాకుండా మరో బాధ్యతను కొరటాలనే తీసుకున్నారట. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ను మొత్తం ఇప్పుడు కొరటాలనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కొరటాలకు రామ్ చరణ్ పూర్తి అధికారాలు ఇవ్వడంతో.. డిస్ట్రిబ్యూషన్ హక్కులు, శాటిలైట్ హక్కులు, థియేట్రికల్ హక్కులు ఇలా ప్రతీది తానే చూసుకుంటున్నారట కొరటాల.
అంతేకాదు ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ప్రారంభించిన కొరటాల.. తనకు సన్నిహితంగా ఉన్న వారికి డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తున్నారట. అయితే ఈ మూవీ నైజాం, గుంటూరు హక్కులను తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు చాలా ప్రయత్నించారట. కానీ కొరటాల మాత్రం ఆయనను పక్కనపెట్టారట. ఈ క్రమంలో నైజాం రైట్స్ లక్ష్మణ్(దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఇటీవల ఈయన బయటకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి)కు, ఉత్తరాంధ్ర హక్కులను సుధాకర్ అనే తన సన్నిహితుడికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దిల్ రాజు కాస్త చిన్నబుచ్చుకున్నారని కూడా సమాచారం. ఇదిలా ఉంటే దిల్ రాజు సంస్థ నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్.. పవన్ కల్యాణ్- క్రిష్ మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read This Story Also: దిల్ రాజుకు చెక్ పెట్టేందుకు అతడికి సపోర్ట్ చేస్తున్నారా..!