Yash : బాబోయ్.. అంత బరువు ఎలా మోసావ్ అన్నా.. రావణుడి పాత్ర కోసం యష్ కష్టం చూశారా ?.. బట్టలు, కిరీటం ఎన్ని కిలోలంటే..
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించిన రామాయణం చిత్రం ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటించిన యష్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నడకలో రాజసం, నటనలో గాంభీర్యం చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం యష్ ఎన్ని కిలోల బరువును నిత్యం మోసాడో తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

రామాయణం.. ప్రస్తుతం థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.663.90 కోట్ల వసూళ్లు దాటింది. విడుదలైన మొదటి సోమవారం రోజే ఈ చిత్రం భారతీయ సినిమాలోని అత్యధిక వసూళ్ల ఐదు రికార్డులనూ బద్దలు కొట్టి, ఒక్క భారత్ లోనే రూ.107.5 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటివరకు రూ. 346.35 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు యష్. రావణుడి పాత్రలో అద్భుతమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు యష్ పాత్ర గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. ఎందుకంటే తన పాత్ర కోసం యష్ ధరించిన దుస్తులు, బంగారు నగల గురించి.. వాటి బరువు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ చిత్రానికి కాస్ట్యూమ్ స్టైలిస్ట్, డిజైనర్ అయిన సానియా సర్ధారియా, సినిమాలో యష్ ధరించిన కొన్ని దుస్తులు 33 కిలోగ్రాముల వరకు బరువు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..
రావణుడి కిరీటం బరువు ఒక్కటే 1.8 కిలోలు ఉంటుందని సానియా స్పష్టం చేసింది. సాధారణ సన్నివేశాలలోని దుస్తులు, ఆభరణాలతో సహా 16 నుంచి 20 కిలోల బరువు ఉండగా.. లంకకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు, పెళ్లి దుస్తులు, శూర్పణఖ పెళ్లిలో ధరించిన బట్టలు 30 నుంచి 33 కిలోల బరువు ఉన్నాయని ఆమె తెలిపింది. ట్రైబ్ అమ్రపాలి సీఈఓ తరంగ్ అరోరా, బంగారు లంక పాలకుడైన రావణుడి వైభవాన్ని, అతని పాత్రలోని అంతర్గత సంక్లిష్టతలను ప్రతిబింబించేలా ఈ ఆభరణాలను రూపొందించారని కూడా పేర్కొన్నారు. శివ భక్తుడు కావడం వల్ల, త్రిశూలం, సర్ప రూపాలు, రాక్షస ముఖాలు వంటి చిహ్నాలను అతని దుస్తులు, ఆభరణాలలో పొందుపరిచారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..
హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటించిన ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా నిర్మించారు. హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన సంగీతం సినిమా దృశ్యాలకు మరింత వన్నె తెచ్చింది. రామాయణం థియేటర్లలో తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
యష్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
