Tollywood : ఒక్క సంతకంతో కోట్ల ఆస్తి పోగొట్టుకున్న టాలీవుడ్ నటి.. కారణం చెబుతూ ఎమోషనల్..
నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రపంచంలో అనేక చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. తల్లి, అత్త, వదిన, అక్క ఇలా వైవిధ్యమైన పాత్రలు పోషించి సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఒక్క సంతకం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె నిజ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అలాగే ఎన్నో సవాళ్లను అధిగమించి సినిమాలతో బిజీ అయ్యింది.

తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున నటీమణులలో సుధ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వెండితెర పై తన నటనతో అలరించిన ఆమె.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కోంది. మీకు తెలుసా.. ? ఒక్క సంతకంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కోట్ల ఆస్తి పోగొట్టుకుంది. భర్త, కొడుకు ఇద్దరిని కోల్పోయింది. సుధ 1984లో మోహన్, ఊర్వశి జంటగా నటించిన ‘ఓ మనే మనే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు హేమ సుధ. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..
ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సుధ.. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. చాలా కాలంగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి బయటపెట్టారు. ధనిక కుటుంబంలో పుట్టిన ఆమెకు.. నలుగురు అన్నయ్యలు. ఒకే ఒక్క అమ్మాయి కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో తన తల్లి ఆస్తి మొత్తాన్ని వదలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు డబ్బుతోపాటు కీర్తి కూడా వచ్చిందని తెలిపింది. కానీ అదే సమయంలో కష్టాలు కూడా వచ్చాయని తెలిపింది. ఢిల్లీలో ఒక హోటల్ ప్రారంభించానని.. కానీ ఒకే ఒక్క సంతకంతో తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నానని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..
అలాగే తన కొడుకు తనతో గొడవ పెట్టుకుని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిపింది. భర్త, కొడుకు ఇద్దరు తనను వదిలేసి వెళ్లిపోయారని.. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. సుధ సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించింది.
ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
