మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 28 రోజుల పాటు లిక్కర్ షాపులు.. కారణం ఏంటంటే..?
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మీరు 2026లో పార్టీలు, వేడుకలు ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఇది మీకోసమే. కొత్త సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏయే రోజుల్లో మద్యం దుకాణాలు మూతపడతాయో తెలుసా..? ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు ప్రధాన పట్టణాల్లో డ్రై డేస్ జాబితా విడుదల అయ్యింది. ఈ ఏడాది మొత్తం 28 రోజుల పాటు వైన్ షాపులు, బార్‌లు బంద్ కానున్నాయి.

రోజు ఏదైనా మందుబాబులకు మందు ఉండాల్సిందే. చుక్క లేకపోతే వారికి రోజే గడవదు. అయితే వారికి ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్.. 2026 సంవత్సరంలో మన దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో సహా పలు ప్రాంతాల్లో వైన్ షాపులు బంద్ అయ్యే రోజులను ప్రభుత్వాలు ప్రకటించాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖల నిబంధనల ప్రకారం.. జాతీయ సెలవులు, ప్రధాన పండుగలను కలుపుకుని ఈ ఏడాది మొత్తం 28 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
డ్రై డే రోజున రిటైల్ మద్యం దుకాణాలు, బార్‌లు, పబ్‌లు, హోటల్ వేదికలలో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం. శాంతిభద్రతల దృష్ట్యా, పండుగల పవిత్రతను కాపాడటానికి ఎక్సైజ్ శాఖ ఈ ఆదేశాలను జారీ చేస్తుంది.
2026 డ్రై డేస్ పూర్తి లిస్ట్ ఇదే..
- జనవరి 26 – సోమవారం – గణతంత్ర దినోత్సవం
- ఫిబ్రవరి 15 – ఆదివారం – మహాశివరాత్రి
- ఫిబ్రవరి 19 – గురువారం – ఛత్రపతి శివాజీ జయంతి ( మహారాష్ట్రలో మాత్రమే )
- ఫిబ్రవరి 23 – సోమవారం – స్వామి దయానంద్ జయంతి
- మార్చి 04 – బుధవారం, హోలీ
- మార్చి 20 – శుక్రవారం, ఈద్ ఉల్ ఫితర్
- మార్చి 23 – సోమవారం – షహీద్ దివాస్ (మహారాష్ట్రలో మాత్రమే)
- మార్చి 26 – శుక్రవారం, శ్రీరామ నవమి
- ఏప్రిల్ 03 – శుక్రవారం, గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్10 – శుక్రవారం, మహావీర్ జయంతి
- ఏప్రిల్ 14 – మంగళవారం, అంబేద్కర్ జయంతి
- మే 01 – శుక్రవారం, కార్మిక దినోత్సవం
- మే 27 – బుధవారం, బక్రీద్
- జూన్ 26 – శుక్రవారం, ముహర్రం
- జూలై 25 – శనివారం, ఆషాఢ ఏకాదశి
- జూలై 29 – బుధవారం, గురు పూర్ణిమ
- ఆగస్టు 15 – శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్టు 25 – మంగళవారం, ఈద్-ఎ-మిలాద్
- సెప్టెంబర్ 04 – శుక్రవారం, జన్మాష్టమి
- సెప్టెంబర్ 14 – సోమవారం, గణేష్ చతుర్థి (మహారాష్ట్ర, కర్ణాటక)
- సెప్టెంబర్ 25 – శుక్రవారం, అనంత చతుర్దశి (మహారాష్ట్రలో మాత్రమే)
- అక్టోబర్ 02 – శుక్రవారం, గాంధీ జయంతి
- అక్టోబర్ 07 – బుధవారం, మహర్షి వాల్మీకి జయంతి
- అక్టోబర్ 20 – మంగళవారం, దసరా కొన్ని నగరాల్లో
- నవంబర్ 05 – గురువారం, కార్తీక ఏకాదశి
- నవంబర్ 08 – ఆదివారం, దీపావళి ( ఢిల్లీ-NCR మాత్రమే)
- నవంబర్ 24 – మంగళవారం, గురునానక్ జయంతి
- డిసెంబర్ 25 – శుక్రవారం, క్రిస్మస్
ప్రాంతాల వారీగా స్వల్ప మార్పులు
డ్రై డేస్ జాబితాలో జాతీయ సెలవులు అందరికీ సమానంగా ఉన్నప్పటికీ, కొన్ని మతపరమైన సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి.
మహారాష్ట్ర: శివాజీ జయంతి, షహీద్ దివాస్, అనంత చతుర్దశి రోజుల్లో అక్కడ వైన్ షాపులు మూసివేస్తారు.
కర్ణాటక: గణేష్ చతుర్థి రోజున బెంగళూరు వంటి నగరాల్లో ఆంక్షలు ఉంటాయి.
ఢిల్లీ: దీపావళి రోజున ఢిల్లీ-NCR పరిధిలో డ్రై డేగా ప్రకటించారు.
పండుగలు లేదా వేడుకల సమయంలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ డ్రై డేస్ షెడ్యూల్‌ను ముందుగానే గమనించి మీ ప్లాన్‌లను సర్దుబాటు చేసుకోవడం ఉత్తమం.
