కెజిఎఫ్ 2: అరివీర భయంకరుడు ఈ ‘అధీరా’..!

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కెజిఎఫ్’. ఈ చిత్రం గతేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజై ‘కెజిఎఫ్’ అన్ని చోట్లా భారీ వసూళ్లు రాబట్టింది. దీనితో చిత్ర దర్శకుడు. హీరో యష్ దేశవ్యాప్తంగా ఫేమస్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మెయిన్ విలన్ అధీరా ఫస్ట్ లుక్‌ను […]

కెజిఎఫ్ 2: అరివీర భయంకరుడు ఈ 'అధీరా'..!
Follow us

|

Updated on: Jul 29, 2019 | 3:41 PM

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘కెజిఎఫ్’. ఈ చిత్రం గతేడాది విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజై ‘కెజిఎఫ్’ అన్ని చోట్లా భారీ వసూళ్లు రాబట్టింది. దీనితో చిత్ర దర్శకుడు. హీరో యష్ దేశవ్యాప్తంగా ఫేమస్ కూడా అయ్యారు.

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా ‘కెజిఎఫ్ 2’ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో మెయిన్ విలన్ అధీరా ఫస్ట్ లుక్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. వెనుక భారీ సైన్యంతో తలపాగాతో కూడిన ముసుగు ధరించిన సంజయ్ దత్ కిల్లర్ లుక్స్‌తో భయంకరంగా ఉన్నాడు. ఈ లుక్ చూసిన అభిమానులు హీరో రాకీను ఎదుర్కోగలిగిన గట్టి సమర్ధుడు అని కామెంట్స్ చేస్తున్నారు.

అధీరాగా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కనిపిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. మొదటి భాగాన్ని నిర్మించిన హోమబుల్ ఫిలిమ్స్ ఈ భాగాన్ని కూడా నిర్మిస్తుంది. ‘కెజిఎఫ్ 2’ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.