AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగిపోయిన మొదటి సినిమాను పూర్తి చేయనున్న కీర్తి

తెలుగులో కీర్తి సురేష్‌ మొదటి చిత్రం ఏదంటే.. వెంటనే అందరికీ నేను శైలజ గుర్తుకు వస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ఓ చిత్రానికి ఒప్పుకున్నారు కీర్తి

ఆగిపోయిన మొదటి సినిమాను పూర్తి చేయనున్న కీర్తి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 15, 2020 | 1:41 PM

Share

Keerthy Suresh news: తెలుగులో కీర్తి సురేష్‌ మొదటి చిత్రం ఏదంటే.. వెంటనే అందరికీ నేను శైలజ గుర్తుకు వస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ఓ చిత్రానికి ఒప్పుకున్నారు కీర్తి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. నందిని నర్సింగ్ హోమ్‌ ఫేమ్‌ నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ‘ఐనా ఇష్టం నువ్వు’ అనే మూవీకి కీర్తి ఒప్పుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. అంతేకాదు దీనికి సంబంధించిన టీజర్లు కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. ఇక కారణాలు తెలీవు గానీ ఆ సినిమా అప్పట్లో ఆగిపోయింది. ఆ తరువాత కీర్తి, నేను శైలజలో నటించగా.. ఆ మూవీనే కీర్తి మొదటి చిత్రంగా అందరికీ గుర్తుండిపోయింది. ఇక నేను లోకల్, మహానటి ఇలా వరుస సక్సెస్‌లతో కీర్తి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమాను పూర్తి చేసేందుకు కీర్తి ఓకే చెప్పిందట. ఈ విషయాన్ని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేసేందుకు కీర్తి ఒప్పుకుందని, ఈ మూవీని అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేస్తామని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్‌ చేతినిండా చిత్రాలు ఉన్నాయి. రజనీకాంత్, మహేష్ బాబు ఇలా పలువురి స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నటిస్తోంది. అంతేకాదు ఆమెకంటూ ఒక బ్రాండ్ ఉంది. అయినా అవన్నీ పట్టించుకోకుండా దర్శకనిర్మాతల గురించి ఆలోచించి, ఆగిపోయిన ఆ సినిమాను పూర్తి చేసేందుకు కీర్తి ఒప్పుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. కాగా ఈ సినిమాకు రామ్ ప్రసాద్ రౌత్ దర్శకత్వం వహించారు.

Read More:

దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ఇంటికి అనుమతి

కంగనా భద్రత కోసం రూ.10లక్షల భారం.. కౌంటర్‌ ఇచ్చిన నటి

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..