శర్వాకు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ..!

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో శర్వానంద్ ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 8:29 am, Tue, 15 September 20
శర్వాకు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ..!

Sharwanand Mahasamudram movie: ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో శర్వానంద్ ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. మహా సముద్రం పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతుండగా.. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో శర్వానంద్ జోడీగా సాయి పల్లవి నటించబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు రాగా.. తాజాగా మరో హీరోయిన్ పేరు లైన్‌లోకి వచ్చింది.

కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్‌ని ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ నచ్చేయడంతో ఇందులో నటించేందుకు ఆమె ఒప్పుకుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మరో క్రేజీ పెయిర్‌ని తెరపై చూడగలం. ఇక బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో సిద్ధార్థ్‌ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తైన తరువాత మహా సముద్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read More:

మంత్రి అవంతి శ్రీనివాస్‌కి కరోనా పాజిటివ్‌

ఆ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. మోనాల్ ఏమందంటే