‘దొంగ’ రివ్యూ

నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్యరాజ్, సీత, షావుకారు జానకి, ఇళవరసు తదితరులు దర్శకత్వం: జీతూ జోసెఫ్ నిర్మాతలు: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన సంగీతం: గోవింద్ వసంత సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్ కోలీవుడ్ నటుడే అయినప్పటికీ టాలీవుడ్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నటుడు కార్తి. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకున్న కార్తి.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక దీపావళి సమయంలో ఖైదీ […]

'దొంగ' రివ్యూ
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 6:46 PM

నటీనటులు: కార్తీ, జ్యోతిక, నిఖిల విమల్, సత్యరాజ్, సీత, షావుకారు జానకి, ఇళవరసు తదితరులు దర్శకత్వం: జీతూ జోసెఫ్ నిర్మాతలు: వియాకమ్ 18 మోషన్ పిక్చర్స్, సూరజ్ సాధన సంగీతం: గోవింద్ వసంత సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్

కోలీవుడ్ నటుడే అయినప్పటికీ టాలీవుడ్‌లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నటుడు కార్తి. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ఓ ఐడెంటిటీని తెచ్చుకున్న కార్తి.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఇక దీపావళి సమయంలో ఖైదీ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ ఇప్పుడు దొంగతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చాడు. జీతూ జోసెఫ్(దృశ్యం ఫేమ్) దర్శకత్వం వహించడం.. రియల్ లైఫ్‌లో కార్తీ వదిన అయిన జ్యోతిక ఈ మూవీలో అతడి సోదరిగా నటించడంతో.. దొంగపై మొదటి నుంచి అంచనాలు మంచిగా ఉన్నాయి. మరి ఈ అంచనాలను దొంగ ఏ మేరకు అందుకుందో తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ: సంపన్న కుటుంబానికి చెందిన ఙ్ఞాన మూర్తి(సత్య రాజ్) తప్పి పోయిన తన కుమారుడు శర్వా కోసం 15ఏళ్లుగా వెతుకుతుంటాడు. ఙ్ఞాన మూర్తి కుమార్తె పార్వతి(జ్యోతిక)కూడా తన తమ్ముడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బు కోసం విక్కీ(కార్తీ)ని శర్వాగా వారింట్లో ప్రవేశపెడతాడు. ఆ ఇంటికి రాకముందు గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్‌లు చేస్తూ బ్రతికేస్తుంటాడు విక్కీ. మరి శర్వాగా ఙ్ఞాన మూర్తి ఇంట్లోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి..? ఙ్ఞాన మూర్తి కుటుంబం విక్కీని శర్వాగా నమ్మిందా..? చివరకు విక్కీ, పార్వతి, ఙ్ఞాన మూర్తిల కథ ఎలా ముగిసింది..? అనేది కథ.

కథనం: దృశ్యంతో మంచి పేరు సాధించుకున్న జీతూ జోసెఫ్.. మరోసారి థ్రిల్లర్ కథనే ఎంచుకున్నారు. ఒక చిన్న పాయింట్‌నే తన కథగా తీసుకున్నప్పటికీ.. దానిని తెరకెక్కించడంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్‌ కాస్త బోర్‌గా తీసినప్పటికీ.. సెకడాంఫ్‌లో మాత్రం ట్విస్ట్‌లతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పుట్టించారు. అయితే తమిళ్‌లో ఈ మూవీకి తంబీ(తమ్ముడు)అనే టైటిల్ పెట్టడంతో.. సినిమా మొత్తం జ్యోతిక, కార్తీ మధ్య జరుగుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ జ్యోతిక పాత్రను ఆయన కాస్త నిర్లక్ష్యం చేశారు. అలాగే అక్కడక్కడ అతడు ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. దీంతో అందరినీ ఈ సినిమా మెప్పించకపోవచ్చు. కానీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నటీనటులు: ఈ సినిమాకు మొదటి అస్సెట్ కార్తీ. ఫస్టాఫ్‌లో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించిన కార్తీ.. సెకండాఫ్‌లో యాక్షన్, ఎమోషన్లలో కూడా మెప్పించారు. ఇక కార్తీ తరువాత సత్యరాజ్‌కు ఈ సినిమాలో మంచి స్పేస్ లభించింది. భిన్న షేడ్స్‌లో తన పాత్రను పూర్తి న్యాయం చేశారు సత్యరాజ్. ఇక జ్యోతికకు మొదటి భాగంలో పెద్దగా సన్నివేశాలు లేకపోగా.. క్లైమాక్స్‌లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. వీరితో పాటు చాలా కాలం తరువాత తిరిగొచ్చిన తన ప్రియుడి కోసం తపించే అమ్మాయి పాత్రలో నిఖిల విమల్, కన్నింగ్ పోలీస్ అధికారిగా ఇళవరసి.. జ్యోతిక ట్యూషన్ స్టూడెంట్‌గా చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం: గోవింద వసంత అందించిన పాటలు మంచి టాక్‌ను తెచ్చుకోగా.. బీజీఎమ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ పనితనం ఈ సినిమాకు మరో అస్సెట్. అందమైన కొండ ప్రాంతంలో నడిచిన మూవీ సన్నివేశాలను ఆయన చక్కగా తెరకెక్కించారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

తీర్పు: థ్రిల్లర్ కథాంశాలను మెచ్చే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో.. బీ, సీ సెంటర్లలో ఇది పెద్దగా ఆడకపోవచ్చు. అందునా తెలుగులో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కార్తీ తన సినిమాను విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో కమర్షియల్‌గా ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ