బ్రేకింగ్: లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారుల సోదాలు.. షాక్‌లో హీరోయిన్..!

టాలీవుడ్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, […]

బ్రేకింగ్: లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారుల సోదాలు.. షాక్‌లో హీరోయిన్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 20, 2019 | 7:04 PM

టాలీవుడ్ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ఇంట్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంపై  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న లావణ్య సినిమా షూటింగ్ రద్దు చేసుకుని ఇంటికి చేరుకుంది. అయితే ఆమె ఇంటితో పాటు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో డీజీజీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాలు చేస్తోంది. రూ.కోట్లలో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై దాడులు జరుగుతున్నాయి. అయితే ఆమెకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం ఇదే తొలిసారి. కాగా ఈ ఏడాది అర్జున్ సురవరంతో మంచి విజయాన్ని అందుకున్న లావణ్య.. ప్రస్తుతం A1 ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటిస్తోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో లావణ్య.. హాకీ ప్లేయర్‌గా కనిపించబోతున్నట్లు టాక్.