నాని మూవీలో ఆర్ఎక్స్ 100 హీరో..!

నాని మూవీలో ఆర్ఎక్స్ 100 హీరో..!

నేచురల్ స్టార్ నాని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం నేడు ప్రారంభం అయింది. ఇక ఇందులో నెగటివ్ పాత్రలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపించనున్నాడు. ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత హీరోగా వరస ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఈ సినిమా ఆఫర్ ఒప్పుకోవడం కొంతమందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ఇలా ఉంటే కార్తికేయ మాత్రం అలోచించి ఈ ఆఫర్ […]

TV9 Telugu Digital Desk

|

Feb 18, 2019 | 7:21 PM

నేచురల్ స్టార్ నాని విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రం నేడు ప్రారంభం అయింది. ఇక ఇందులో నెగటివ్ పాత్రలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కనిపించనున్నాడు. ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత హీరోగా వరస ఆఫర్స్ వస్తున్న తరుణంలో ఈ సినిమా ఆఫర్ ఒప్పుకోవడం కొంతమందికి ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇది ఇలా ఉంటే కార్తికేయ మాత్రం అలోచించి ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హీరోగా మాత్రమే కాదు, నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్రలు కూడా చేస్తే నటుడుగా మంచి గుర్తింపు వస్తుందని కార్తికేయ ఆలోచనట . ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడని ఫిలిం నగర్ టాక్. కొందరు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతుంటే.. మరికొందరు మంచి నిర్ణయం తీసుకున్నాడని అభినందిస్తున్నారట. ఏది ఏమైనా ఈ సినిమా కార్తికేయ కు నటుడుగా మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu