AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు ఎనిమిది సార్లు తినడమే ఫిట్‌నెస్.. బాలీవుడ్ వెటరన్ బ్యూటీ డైట్ గురించి చెబుతున్న న్యూట్రిషనిస్ట్

Kareena Kapoor Fitness Secrets : ఈ మధ్యే రెండో బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ వెటరన్ బ్యూటీ కరీనా కపూర్ కాస్త లావైనా తిరిగి ఫిట్‌నెస్‌ పొందేందుకు

రోజుకు ఎనిమిది సార్లు తినడమే ఫిట్‌నెస్.. బాలీవుడ్ వెటరన్ బ్యూటీ డైట్ గురించి చెబుతున్న న్యూట్రిషనిస్ట్
Kareena Kapoor
uppula Raju
|

Updated on: Mar 27, 2021 | 3:36 PM

Share

Kareena Kapoor Fitness Secrets : ఈ మధ్యే రెండో బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ వెటరన్ బ్యూటీ కరీనా కపూర్ కాస్త లావైనా తిరిగి ఫిట్‌నెస్‌ పొందేందుకు వర్కౌట్ స్టార్ట్ చేసింది. ఒకప్పుడు జీరో సైజ్‌‌ను ట్రెండ్‌ చేసిన కరీనా కపూర్ 40 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్‌నెస్‌తో సక్సెస్‌ఫుల్ సినీ కెరియర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే ఈ వయసులో కూడా కరీనా అంతే గ్లామర్ మెయింటైన్ చేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటో తన న్యూట్రిషనిస్ట్ చెప్పేసింది.

కరీనా రోజుకు ఎనిమిదిసార్లు మితంగా ఆహారం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిపింది. ఆమె డైట్ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ఉదయం లేవగానే కుంకుమ పువ్వుతో కలిసిన ఎండు ద్రాక్ష తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్‌గా పరాఠా చట్నీ తింటుందని వివరించింది. లంచ్‌కు ముందు సబ్జా గింజలు, కొబ్బరి నీళ్లు తీసుకుని మధ్యాహ్న భోజనంగా పెరుగన్నం, ఆవకాయ స్వీకరిస్తుందని తెలిపింది. కాస్త గ్యాప్‌లో వాల్ నట్స్, చీజ్ తీసుకుంటుందని, ఈవినింగ్ టైమ్‌లో బనానా మిల్క్ షేక్, స్నాక్స్ తింటుందని తెలిపింది. రాత్రి భోజనంలో వెజ్ పులావ్, పెరుగు.. పడుకునే ముందు పాలు తాగుతుందని వివరించింది.

కరీనా కపూర్ కి అల్పాహారం తీసుకోకుండా వ్యాయామం చేయడం ఇష్టం. కరీనా పెద్ద స్క్రీన్ పై చాలా హిట్ చిత్రాలను అందించింది. వీటిలో కబీ ఖుషి కబీ ఘం, త్రీ ఇడియట్స్, జబ్ వి మెట్, బజరంగీ భాయ్ జాన్, తాషన్, బాడీగార్డ్ వంటి సినిమాలతో ఇంకా మరెన్నో ఉన్నాయి. కారీనా కపూర్ నటనకి, సినిమాలకి అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. కరీనా కపూర్ సంపాదన గురించి చూస్తే సినిమాలు, ప్రకటనలు, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఆమె అధిక సంపాదిస్తుంది. 2019లో కరీనా కపూర్ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్‌ జడ్జ్ గా వ్యవహరించింది.

Assam Election 2021 Phase 1 Voting LIVE: కొనసాగుతోన్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు.. రెండు గంటల వరకు ఎంత పోలింగ్‌ జరిగిందంటే..

Mamata Banerjee: నందిగ్రామ్‌లో సాయం చేయండి.. బీజేపీ నేతకు మమతా ఫోన్‌.. కాల్‌ రికార్డింగ్‌ వైరల్‌

Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తపోయే విషయాలు