ఈ కథను పట్టుకుని చాలా తిరిగాను.. సింహా కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు.. అసలు విషయం చెప్పిన దర్శకుడు..

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ప్రస్తుతం సింహాహ హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం

ఈ కథను పట్టుకుని చాలా తిరిగాను.. సింహా కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు.. అసలు విషయం చెప్పిన దర్శకుడు..
Manikanth Gelli
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2021 | 2:36 PM

తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు శ్రీ సింహా కోడూరి. ప్రస్తుతం సింహాహ హీరోగా మణికాంత్ జెల్లీ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `తెల్లవారితే గురువారం`. రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలు. కాల భైరవ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు మణికాంత్  చిత్రవిశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భమగా ఆయన మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. కానీ ఆర్థిక పరిస్థితి బాగలేక పోవడంతో ఉద్యోగం చేశాను. తమ్ముడు సెటిల్ అయ్యాడని సినిమా ప్రయత్నాలు చేశాను. ఇక అంతలోపే ప్రేమ వివాహం చేసుకోవడం తో కష్టాలు మొదలయ్యాయి. అయితే నా భార్య ఆర్థికంగా తోడు నిలిచింది. ఆమె ప్రోత్సాహoతో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా శ్రీమతి పేరు మధు. ఆవిడ పేరునే ఓ హీరోయిన్‌కు పెట్టాను అని అన్నారు.

అలాగే చాలా సినిమాలకు పని చేశాను. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమాకు అసిస్టెంట‌ గా అజయ్ భూపతి వద్ద పని చేశాను. ఆ మూవీ తరువాత నన్ను సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టమని అజయ్ సలహా ఇచ్చాడు. అలా ఈ కథను పట్టుకుని తిరిగాను.  నా ఫ్రెండ్ రంగస్థలం కోసం రత్నవేలు వద్ద అసిస్టెంట్‌గా పని చేశాడు. అదే సినిమాకు సింహా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నేను కొత్త హీరో కోసం ట్రై చేస్తున్నా అని తెలిసి నా ఫ్రెండ్ ఈ కథను సింహాకు చెప్పమన్నాడు. అలా సింహా కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు. అంతా పది రోజుల్లోనే సెట్ అయింది. నిర్మాత సాయి, కలర్ ఫోటో నిర్మాతలకు నచ్చడంతో సంయుక్తంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అలా పది రోజుల్లోనే చెక్ ఇచ్చేశారని చెప్పుకొచ్చారు మణికాంత్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: బోట్ కోసం పరుగులు పెట్టిన కీర్తి.. నవ్వులు పూయిస్తున్న వీడియో నెట్టింట వైరల్

Vedam Nagaiah Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో వేదం నాగయ్య కన్నుమూత