నా బయోపిక్.. నా ఇష్టం

బాలీవుడ్‌లో లేడీ డాన్‌గా పేరొందిన కంగనా రనౌత్ మరో సంచలన ప్రకటన చేసింది. త్వరలో తన బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు ఆమె ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడని.. తన దర్శకత్వంలోనే ఈ బయోపిక్ తెరకెక్కనుందని పేర్కొంది. అంతేకాకుండా మణికర్ణికకు పనిచేసిన టెక్నికల్ టీమ్‌ ఈ చిత్రంలో భాగం అవ్వనున్నట్లు కంగనా వెల్లడించింది. కంగన జీవితంలో అనేక ఘటనలను ఈ చిత్రంలో చూపించనున్నామని.. ఇండస్ట్రీలో ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది […]

నా బయోపిక్.. నా ఇష్టం

బాలీవుడ్‌లో లేడీ డాన్‌గా పేరొందిన కంగనా రనౌత్ మరో సంచలన ప్రకటన చేసింది. త్వరలో తన బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నట్లు ఆమె ప్రకటించింది. ఇందుకోసం ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నాడని.. తన దర్శకత్వంలోనే ఈ బయోపిక్ తెరకెక్కనుందని పేర్కొంది. అంతేకాకుండా మణికర్ణికకు పనిచేసిన టెక్నికల్ టీమ్‌ ఈ చిత్రంలో భాగం అవ్వనున్నట్లు కంగనా వెల్లడించింది.

కంగన జీవితంలో అనేక ఘటనలను ఈ చిత్రంలో చూపించనున్నామని.. ఇండస్ట్రీలో ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనే విషయాలను కూడా చూపించనున్నామని ఆమె టీమ్ తెలిపింది. కాగా 2006 సంవత్సరంలో ‘గ్యాంగ్‌స్టర్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైన కంగనా.. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘ఫ్యాషన్’, ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ వంటి హిట్ చిత్రాలలో నటించింది. మూడు జాతీయ అవార్డులను సైతం అందుకున్న కంగనా.. పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకుంది. హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆదిత్య పంచోలి తదితర బాలీవుడ్ ప్రముఖులపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఇటీవల వచ్చిన మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ షూటింగ్ సమయంలో టాలీవుడ్ దర్శకుడు క్రిష్‌తో గొడవ పెట్టుకుంది. దీంతో మూవీ సెట్స్ మీద ఉండగానే ఆయన బయటకు రాగా.. మిగిలిన భాగానికి తానే దర్శకత్వం వహించి క్రెడిట్ మొత్తాన్ని తీసుకుంది. మరి తన మాటలతో ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న కంగనా.. బయోపిక్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Published On - 1:20 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu