మరో వివాదంలో కంగనా రనౌత్.. తన పరువుకు భంగం కలిగించిందని కేసు వేసిన బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్అక్తర్..
ఎవ్వరు ఏమనుకున్నా సరే తన మనసులోని మాటలను కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.
Kangana Ranaut another controversy: ఎవ్వరు ఏమనుకున్నా సరే తన మనసులోని మాటలను కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మరణంపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లను ఓ ఊపు ఊపేసింది ఈ అమ్మడు. ఎన్నో విమర్శలను ఎదుర్కొని ఆఖరికి మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన పార్టీతో ఢీ అంటే ఢీ అంది. ఈ గొడవ వల్ల ముంబైలో శివసేన నాయకులు కంగనా ఇళ్లును కూడా కూల్చేశారు. అయినా కంగనా బెదరకుండా పోరాడింది. అయితే తాజాగా మరో వివాదంలో నిలిచింది ఈ అమ్మడు. బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్ అక్తర్ కంగనాపై పరువునష్టం దావా వేశారు. ఇండస్ట్రీలో ఇప్పడు ఇది హాట్ టాఫిక్‌గా మారింది.
కంగనా రనౌత్ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందన్నారు జావేద్. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక అనవసరంగా తన పేరును లాగారని ఆరోపిస్తూ.. కంగనా రనౌత్ పై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేసారు. కంగనా పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేయాలని జావేద్ అక్తర్ కోరారు. తనపై ఆరోపణలు చేస్తూ అవమానకరంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కోర్టు వారికి సమర్పించారు జావేద్ అక్తర్. అయితే కోర్టు ఈ కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది. కాగా సుశాంత్ మరణానికి సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.