తమిళ తంబీల మాయలో పడ్డ రాశీ ఖన్నా, గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు, ఫిట్‌నెస్‌పై మరింత ఫోకస్ !
మనసా వాచా మళ్లీ కోలీవుడ్నే నమ్ముకుంటున్నారు రాశీఖన్నా. ప్రతిరోజూ పండగే తర్వాత తెలుగులో పండగ మిస్సయిన రాశీకి తమిళ్ లో ఆఫర్లు వరదలా వచ్చేస్తున్నాయి.
మనసా వాచా మళ్లీ కోలీవుడ్నే నమ్ముకుంటున్నారు రాశీఖన్నా. ప్రతిరోజూ పండగే తర్వాత తెలుగులో పండగ మిస్సయిన రాశీకి తమిళ్ లో ఆఫర్లు వరదలా వచ్చేస్తున్నాయి. లేటెస్ట్ గా ఒక సీనియర్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారట. సో.. ఏంజెల్ ఆర్నాకి థర్డ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ఉండబోతోందన్న మాట. దీనంతటికీ అసలు కారణం వేరే ఏదైనా ఉందా?..అంటే అవుననే మాట వినిపిస్తోంది సినిమా వర్గాల నుంచి.
మిగతా హీరోయిన్లతో పోలిస్తే రాశీఖన్నా కెరీర్ కొంచెం వెరైటీగా ఉంటుంది. అక్కడ కాదంటే ఇక్కడ.. ఇక్కడ కాదంటే అక్కడ..! టాలీవుడ్, కోలీవుడ్ మధ్య షటిల్ కొడుతున్నారు రాశీ. రెండేళ్ల కిందట ఆక్సిజన్ నుంచి శ్రీనివాస కళ్యాణం దాకా సింగిల్ స్ట్రెచ్ లో నాలుగు సినిమాల్లో నటించారామె. ఆ వెంటనే చలో కోలీవుడ్ అనేశారు. వెంకీమామకు ముందు.. ఏడాది పాటు తమిళ్ లో ఆమె చాలా బిజీ. బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ తమిళ్ తంబీల మాయలో పడ్డారు.
లాక్ డౌన్ గ్యాప్ ని ఏ మాత్రం వేస్ట్ చెయ్యకుండా తమిళ్ లాంగ్వేజ్ ని ఒక పట్టు పట్టారు రాశీ. జిమ్ముకి వెళ్లి వర్కవుట్స్ చేసి.. ఫిజిక్ ని కాపాడుకున్నారు. తనకిష్టమైన గిటార్ వాయిద్యాన్ని కూడా సంపూర్ణం చేసుకున్నారు. రీసెంట్ గా కలర్ ఫుల్ ఓణీలో పల్లెటూరి బొమ్మలా మెరుస్తూ తనలో ఆ గ్రేస్ తగ్గనేలేదని సినీ ప్రపంచానికి చాటుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పడు కూడా నాలుగు తమిళ్ ప్రాజెక్టులున్నాయి రాశీ చేతిలో. చియాన్ విక్రమ్ తో సింగం ఫేమ్ హరి డైరెక్ట్ చెయ్యబోయే మూవీలో కూడా హీరోయిన్ రాశీయేనన్నది లేటెస్ట్ న్యూస్. సో.. కోలీవుడ్ లో ఈ అమ్మడి బండి మళ్లీ హైవే ఎక్కేసినట్లే!
Also Read :
నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్
మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !
ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి
బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !