తలైవి షూటింగ్ పూర్తి చేసిన కంగన.. ఉన్నట్టుండి `బై` చెప్పే సమయం వచ్చిందంటూ ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్న తాజాగా చిత్రం తలైవి. తమిళనాట సంచలనం సృష్టించిన జయలలిత జీవిత కథ ఆదారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తలైవి షూటింగ్ పూర్తి చేసిన కంగన.. ఉన్నట్టుండి `బై` చెప్పే సమయం వచ్చిందంటూ ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2020 | 9:32 AM

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్న తాజాగా చిత్రం ‘తలైవి’. తమిళనాట సంచలనం సృష్టించిన జయలలిత జీవితకథ ఆదారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవి’లో ప్రకాష్ రాజ్- అరవింద్ స్వామి- భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది కంగన.

‘అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘తలైవి’ నుంచి విప్లవాత్మక నాయకురాలి పాత్ర చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసాం.. అరుదుగా ఒక నటి లేదా నటుడు  రక్తమాంసాలతో సజీవంగా కనిపించే పాత్రలో కనిపిస్తాం. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి `బై` చెప్పే సమయం వచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలు ఎ.ఎల్.విజయ్.. శైలేష్ .. విష్ణు .. బృందా ప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలిపారు కంగన