హీరో నాని న్యూమూవీలో మరో హీరోయిన్.. శ్యామ్ సింగ రాయ్‌తో జతకట్టనున్న అక్కినేని భామ..
నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్. అయితే ఇటీవల విడుదల అయిన ఈ సినిమీ ఫస్ట్ టుక్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
Tollywood News: నేచురల్ స్టార్ నానీ నటిస్తున్న కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్. అయితే ఇటీవల విడుదల అయిన ఈ సినిమీ ఫస్ట్ టుక్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సాయిపల్లవి, క్రితి శెట్టి హీరోయిన్స్‌గా నటించనున్నారు. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా అటు నానీ టక్ జగదీష్ సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. ఆదివారం శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌ను ప్రారంభించగా.. దీనికి నానీ తండ్రి మొదటి క్లాప్ కొట్ట్ మొదలు పెట్టారు. కాగా ఈ సినిమాపై నానీ అభిమానులు అంచనాలు బాగానే పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌తోపాటు మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మూడో హీరోయిన్గా అక్కినేని నాగచైతన్యతోపాటు ప్రేమమ్ మూవీలో ప్రేక్షకుల మెప్పు పొందిన నటి మడోన్నా సెబాస్టియన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమమ్ తర్వాత ఈ బ్యూటీ మళ్లీ చాలా రోజులకు టాలీవుడ్ తెరపై హీరో నానీతో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.