Vikram: వసూళ్లలో తగ్గేదేలే అంటోన్న విక్రమ్.. మరో కొత్త రికార్డును ఖాతాలో వేసుకున్న కమల్ సినిమా..
Vikram Collections: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం విక్రమ్ (Vikram). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించగా సూర్య అతిథి పాత్రలో మెరిశాడు
Vikram Collections: లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం విక్రమ్ (Vikram). లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించగా సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. జూన్ 3న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రిలీజై మూడు వారాలవుతోన్నా, కొత్త సినిమాలు థియేటర్లలోకి అడుగుపెడుతున్నా ఈ సినిమా కలెక్షన్లు హోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు అధిగమించిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. తద్వారా రజనీకాంత్ రోబో 2.0 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన రెండో తమిళ చిత్రంగా కమల్ సినిమా రికార్డు సృష్టించింది.
కాగా థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న విక్రమ్ సినిమా త్వరలోనే డిజిటల్ స్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అంటే జూలై 8 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషన్ల్ ఫిల్మ్స్, మహేంద్రన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో యంగ్ హీరో నితిన్ నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..