శింబు సరసన హలో బ్యూటీ..!

శింబు సరసన హలో బ్యూటీ..!

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’, శర్వానంద్- సుధీర్ వర్మల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న ఒక చిత్రంలో కూడా చేస్తోంది. కాగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఇంకో తమిళ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది. తమిళ హీరో శింబు తన తదుపరి చిత్రం వెంకట్ ప్రభు డైరెక్షన్ […]

Ravi Kiran

|

Mar 25, 2019 | 4:21 PM

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘హలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది కళ్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘చిత్రలహరి’, శర్వానంద్- సుధీర్ వర్మల సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా రూపొందనున్న ఒక చిత్రంలో కూడా చేస్తోంది. కాగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే ఇంకో తమిళ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.

తమిళ హీరో శింబు తన తదుపరి చిత్రం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘మానాడు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఇందులో శింబుకు జోడిగా కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేశారని సమాచారం. నిజానికి ఈ ‘మానాడు’ సినిమా ఆగిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తామని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu