AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిన్న చెర్రీ.. నేడు తారక్.. ఏమైంది..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొదట ఈ మూవీ నుంచి హాలీవుడ్ నటి ఎడ్గర్ జోన్స్ తప్పుకుంది. ఆ తరువాత జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న రామ్ చరణ్ కాలికి చిన్న గాయం అవ్వడంతో.. మూడు వారాల పాటు షూటింగ్‌ను వాయిదా వేసింది చిత్ర యూనిట్. గాయం నుంచి చెర్రీ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ […]

నిన్న చెర్రీ.. నేడు తారక్.. ఏమైంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2019 | 4:38 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మొదట ఈ మూవీ నుంచి హాలీవుడ్ నటి ఎడ్గర్ జోన్స్ తప్పుకుంది. ఆ తరువాత జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న రామ్ చరణ్ కాలికి చిన్న గాయం అవ్వడంతో.. మూడు వారాల పాటు షూటింగ్‌ను వాయిదా వేసింది చిత్ర యూనిట్. గాయం నుంచి చెర్రీ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలనుకుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కుడి చేతికి చిన్న గాయంతో కనిపించాడు. ఆ గాయం ఎలా అయిందో తెలీడం లేదు కానీ.. దీని వలన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఒక్కో సినిమాకు చాలా సమయాన్ని తీసుకుంటాడు జక్కన్న. ప్రతి సీన్‌లోనూ పర్‌ఫెక్షన్ కోరుకునే ఈ దర్శకుడు.. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేసిన దాఖలాలు చాలా తక్కువ. ఒకవైపేమో వచ్చే ఏడాది జూలై 30న ‘ఆర్ఆర్ఆర్‌’ను విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించాడు. మరోవైపు వరుస షాక్‌లతో ‘ఆర్ఆర్ఆర్ ’షూటింగ్‌ బ్రేక్‌లు పడుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పిన సమయానికి సినిమా రాకపోవచ్చని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో చెర్రీ సరసన అలియా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్న విషయం తెలిసిందే.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు