Jani Master: శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. అల్లు అర్జున్ గురించి ఏమన్నారంటే?

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ ను జానీ మాస్టర్ పరామర్శించారు. బుధవారం (డిసెంబర్ 25) భార్యతో కలిసి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన జానీ రేవతి భర్త భాస్కర్, ఇతర కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆర్థిక సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.

Jani Master: శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. అల్లు అర్జున్ గురించి ఏమన్నారంటే?
Jani Master
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2024 | 9:49 PM

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ ను పరామర్శించారు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. బుధవారం (డిసెంబర్ 25) సికింద్రా బాద్ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అలాగే తండ్రి భాస్కర్ ను ధైర్యం చెప్పారు. డ్యాన్సర్స్ యూనియన్ తరఫున సాయం చేస్తామని శ్రీ తేజ్ ఫ్యామీలీకి భరోసా ఇచ్చారు. ‘శ్రీతేజ్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. అతడు త్వరితగతిన కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. భాస్కర్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పాం. భరోసా ఇచ్చాం. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామందికి శ్రీతేజ్‌ను చూడాలని, వచ్చి పలకరించాలని ఉంటుంది. కాకపోతే కొన్ని పరిధుల వల్ల అందరికీ ఇక్కడకు రావడం కుదరడం లేదు’ అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. కాగా ఇదే సందర్భంగా అల్లు అర్జున్ గురించి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారు. ‘ఈ సంఘటన తర్వాత సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్‌ను కలిశారు. మీరు కూడా ఏమైనా కలిశారా? లేదా ఫోన్‌లో మాట్లాడారా?’’ అని విలేకరి జానీ మాస్టర్ ను అడిగారు.

దీనికి స్పందించిన జానీ మాస్టర్.. ‘లేదు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని ముందుగానే నిర్ణయించుకున్నా. అలాగే నాకు వచ్చే సాంగ్స్‌ రిహార్సల్స్‌ చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతూ సంతోషంగా ముందుకు సాగుతున్నాను. ఇక నా కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే విషయాలు మాట్లాడాలనుకోవడం లేదు’ అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కిమ్స్ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతోన్న  జానీ మాస్టర్.. వీడియో ఇదిగో..

గేమ్ ఛేంజర్ లో జానీ మాస్టర్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.