అనారోగ్యంతో పవన్‌: ప్రకృతి వైద్యానికే ఓటు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. మళ్లీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా తెలియజేశారు. అలాగే.. జనసేన అధికారిక లెటర్‌లో తెలిపారు కూడా. అనారోగ్యం కారణంగానే.. పవన్ కొద్దిరోజులుగా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనటం లేదు. దీనికి సంబంధించి చికిత్స తీసుకోవాలని కూడా ఆయన తెలిపారు. అయితే.. పవన్‌కు.. శస్త్రచికిత్స (సర్జరీ) చేయాలని డాక్టర్లు అంటున్నా.. కానీ.. ఆయన ప్రకృతి సిద్ధమైన వైద్యానికే […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:03 pm, Mon, 30 September 19
అనారోగ్యంతో పవన్‌: ప్రకృతి వైద్యానికే ఓటు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. మళ్లీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా తెలియజేశారు. అలాగే.. జనసేన అధికారిక లెటర్‌లో తెలిపారు కూడా. అనారోగ్యం కారణంగానే.. పవన్ కొద్దిరోజులుగా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనటం లేదు. దీనికి సంబంధించి చికిత్స తీసుకోవాలని కూడా ఆయన తెలిపారు.

అయితే.. పవన్‌కు.. శస్త్రచికిత్స (సర్జరీ) చేయాలని డాక్టర్లు అంటున్నా.. కానీ.. ఆయన ప్రకృతి సిద్ధమైన వైద్యానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు.. సమాచారం. సాధారణంగానే.. పవన్‌కు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాగే.. ఆయన చాలా సింపుల్‌గా కూడా ఉంటారు. వెన్నునొప్పి పూర్తిగా తగ్గగానే ఆయన మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆ పార్టీ వర్గీయులు పేర్కొంటున్నారు.

గతంలో.. ‘గబ్బర్‌ సింగ్’ సినిమా షూటింగ్ సమయంలో.. ఆయనకు వెన్నుపూస వద్ద గాయాలు అయ్యాయి. అప్పటినుంచీ వెన్నునొప్పి సమస్య తలెత్తింది. ఆ తర్వాత.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరగగా.. అప్పుడు.. ఫారిన్‌కు వెళ్లి తగిన చికిత్స తీసుకున్నారు. అయితే.. దాన్ని అశ్రద్ధ చేయడంతో.. వెన్ను నొప్పి సమస్య మళ్లీ తిరగబెట్టింది. దీంతో.. అప్పటి నుంచి ఆయన.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.