AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బాస్: రవి ఎలిమినేషన్‌తో.. ఆ ముగ్గురిలో ఒకరికే టైటిల్.?

ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది. నిన్న మొన్నటి వరకు సోసోగా సాగిన ఈ షో.. ఇప్పుడు అసలు సిసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇక తాజాగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన రవికృష్ణ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన రవికృష్ణ.. వరుణ్ […]

బిగ్ బాస్: రవి ఎలిమినేషన్‌తో.. ఆ ముగ్గురిలో ఒకరికే టైటిల్.?
Ravi Kiran
|

Updated on: Sep 30, 2019 | 8:05 PM

Share

ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుంది. నిన్న మొన్నటి వరకు సోసోగా సాగిన ఈ షో.. ఇప్పుడు అసలు సిసలైన మజాను ప్రేక్షకులకు అందిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. ఇక తాజాగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్స్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన రవికృష్ణ హౌస్ నుంచి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే.

సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన రవికృష్ణ.. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్ తర్వాత హౌస్‌లో బలమైన పార్టిసిపెంట్‌గా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో రవి తరపున ఓట్లు వేయాలని ఓ వర్గం గ్రూపుల్లో క్యాంపెయిన్ కూడా జరిగింది. అయితే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్‌కు బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీజన్‌లోనే పదో వారం టఫ్ ఎలిమినేషన్ జరగ్గా.. అందులో రవికృష్ణ ఎలిమినేట్ కావడంతో టైటిల్ విన్నర్ అయ్యే అర్హత ఆ ముగ్గురికి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్‌ల ఒకరు ఖచ్చితంగా టైటిల్ గెలుస్తారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇక మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలీ రెజా‌కు టైటిల్ గెలిచే ఛాన్సులు తక్కువే. దీనికి కారణం ఒకసారి బయటికి వెళ్లొచ్చిన అలీ రెజాను ప్రేక్షకులు మళ్ళీ తిరిగి గెలిపిస్తారని ఆశించలేం. అటు శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ మధ్య టైటిల్ కోసం పోటీ ఉన్నా.. ఫైనల్‌లో వరుణ్- శ్రీముఖిల మధ్యే టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
పిస్తా vs పల్లీలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? నిపుణుల నిజాలు ఇవే
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
తీవ్ర విషాదం.. ముగ్గురు సజీవదహనం!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
బ్యాంక్ లోన్ కావాలా? ఇకపై సిబిల్ ఒక్కటి సరిపోదు.. ఇవి మ్యాండేటరీ
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
సోమవతి అమావాస్య రోజు ఈ తప్పులు చేయొద్దు.. లేదంటే లక్ష్మీదేవి..
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం