AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’… ది బాక్సాఫీస్‌ కింగ్‌!

ఇన్నాళ్లూ అత్యధిక వసూళ్ల పరంగా ‘అవతార్‌’ అగ్రస్థానంలో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ తాజాగా బీట్‌ చేసి, చరిత్ర సృష్టించింది. జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు రాబట్టింది. 2009లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్లు పరంగా అగ్ర స్థానంలోనే ఉంది. ఇన్నేళ్లలో దీన్ని ఏ సినిమా దాటలేకపోయింది. అయితే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. దానికి తగ్గట్టే […]

‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్’... ది బాక్సాఫీస్‌ కింగ్‌!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 23, 2019 | 5:28 AM

Share

ఇన్నాళ్లూ అత్యధిక వసూళ్ల పరంగా ‘అవతార్‌’ అగ్రస్థానంలో ఉంది. కానీ దాన్ని ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ తాజాగా బీట్‌ చేసి, చరిత్ర సృష్టించింది. జేమ్స్‌ కామెరూన్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘అవతార్‌’ ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్లు రాబట్టింది. 2009లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ వసూళ్లు పరంగా అగ్ర స్థానంలోనే ఉంది. ఇన్నేళ్లలో దీన్ని ఏ సినిమా దాటలేకపోయింది. అయితే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ ఈ రికార్డును చేరుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు తొలుత అంచనా వేశారు. దానికి తగ్గట్టే సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. 2.79 బిలియన్‌ డాలర్లు రాబట్టి ‘అవతార్‌’ రికార్డును చెరిపేసింది. అంతేకాదు ఈ సినిమా చైనా, భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది.

‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ కలెక్షన్స్‌ మరింత పెంచాలనే ఉద్దేశంతో మార్వెల్‌ స్టూడియోస్‌ అదనపు సన్నివేశాలు జోడించి రెండోసారి గత నెల 28న థియేటర్లలో విడుదల చేసింది. ఊహించినట్లే సినిమా ఇప్పుడు కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానం దక్కించుకుంది. ‘అవతార్‌’ రెండో స్థానంలో చేరింది. ఈ సందర్భంగా ‘అవతార్‌’ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ మార్వెల్‌ స్టూడియోస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.