‘బిగ్‌బాస్’ని నిలిపే వరకు మా పోరాటం ఆగదు
బిగ్‌బాస్‌ను ఆపే వరకు తమ పోరాటం ఆగదని యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అన్నారు. ఆ షోను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తామని ఆమె అన్నారు. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న ఈ పోరాటానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. ‘బిగ్‌బాస్’ను ఆపాలంటూ ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి, […]
బిగ్‌బాస్‌ను ఆపే వరకు తమ పోరాటం ఆగదని యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి అన్నారు. ఆ షోను నిలిపివేయకుంటే మహిళా, ప్రజా సంఘాలతో కలిసి పోరాటం నిర్వహిస్తామని ఆమె అన్నారు. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాము చేస్తున్న ఈ పోరాటానికి ప్రజాప్రతినిధులు, పార్టీలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. ‘బిగ్‌బాస్’ను ఆపాలంటూ ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య కలిసి మాట్లాడారు.
చిత్ర రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా నిర్వహించడం సరికాదని శ్వేతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక తమిళనాడులో సైతం రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన కమల్ హాసన్ కూడా హోస్ట్‌గా వ్యవహారించడం బాధాకరమని అన్నారు. ఇక ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు ప్రధాని మోదీ వస్తున్నారని,అప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియాతో కలిసి ఈ సమస్యపై ఆయనకు వినతి పత్రం సమర్పిస్తామని తెలిపారు. అయితే రియాలిటీ షో పేరుతో బిగ్‌బాస్ షోలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.