ఇకపై “హౌస్”లో రచ్చ రచ్చే
తొలిరోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు కూడా పెడుతున్నాడు. మొదట ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, ఆశూరెడ్డిలను తప్ప మిగితా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగటం, దాంట్లోంచి సరైన సమాధానాలు చెప్పని ఆరుగురు సభ్యుల పేర్లను చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడం, దాంతో రాహుల్, వరుణ్ సందేశ్, వితికాశేరు, శ్రీముఖి, బాబా బాస్కర్, జాఫర్‌లు ఈవారం నామినేషన్ అవ్వడం తెలిసిందే. అయితే వారికి నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చిన బిగ్‌బాస్ […]
తొలిరోజే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు కూడా పెడుతున్నాడు. మొదట ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, ఆశూరెడ్డిలను తప్ప మిగితా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగటం, దాంట్లోంచి సరైన సమాధానాలు చెప్పని ఆరుగురు సభ్యుల పేర్లను చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించడం, దాంతో రాహుల్, వరుణ్ సందేశ్, వితికాశేరు, శ్రీముఖి, బాబా బాస్కర్, జాఫర్‌లు ఈవారం నామినేషన్ అవ్వడం తెలిసిందే.
అయితే వారికి నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చిన బిగ్‌బాస్ దీనికి ఓ మెలికపెట్టాడు. తనకు బదులుగా ఇంకో ఇంటిసభ్యుణ్ని నామినేట్ చేయాల్సిందిగా సూచించారు. సరైన కారణాలను వివరిస్తూ సదరు ఇంటి సభ్యుడ్ని నామినేట్ చేయాలని సూచించారు. ఇక నామినేట్ అయిన సభ్యులు తనను తాను కాపాడుకోడానికి కూడా అవకాశమిచ్చారు. అయితే దీనికంతటికీ హేమను జడ్జిగా నియమించుకున్నారు.అక్కడివరకు బాగానే ఉంది. ఇక రెండోరోజు పనుల విషయంలో రూల్స్ పాటించడం లేదంటూ హేమ, హిమజల మధ్య చిన్నవార్ స్టార్ట్ కావడం, తనపై నిందలు వేస్తే ఊరుకోను అని హిమజ అనడం ఇవన్నీ చూస్తుంటే ఇంట్లో రానున్న రోజుల్లో రచ్చ మామూలుగా ఉండదు అని అర్ధమైపోతుంది.