AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంతల రోడ్డుపై ఆస్ట్రోనాట్ ‘సత్తి’… సెటైర్ అదిరిందిగా..!

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమం తొలిరోజు అదరహో అనిపించింది. ఇస్మార్ట్ న్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సత్తి.. మంగళవారం నాటి ప్రొగ్రాంలో ప్రభుత్వాలను ఆలోచింపజేసే అంశంతో ముందుకొచ్చాడు. మనం తిరిగే రోడ్లన్నీగుంతల మయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ […]

గుంతల రోడ్డుపై ఆస్ట్రోనాట్ 'సత్తి'... సెటైర్ అదిరిందిగా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 04, 2019 | 5:56 AM

Share

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమం తొలిరోజు అదరహో అనిపించింది. ఇస్మార్ట్ న్యూస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సత్తి.. మంగళవారం నాటి ప్రొగ్రాంలో ప్రభుత్వాలను ఆలోచింపజేసే అంశంతో ముందుకొచ్చాడు. మనం తిరిగే రోడ్లన్నీగుంతల మయం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలియదు. రోడ్డు నిండిగా కనిపిస్తుంది. రోడ్డుపై ఉన్న గుంతల్లో నీళ్లు ఉండటం వల్ల అది ఎంత లోతు ఉందో ఎవ్వరికీ అంతుబట్టని పరిస్థితి. ఇది తెలియక ఏ వాహనదారుడో లేక నడిచి వెళ్లే పాదచారో ఖచ్చితంగా దెబ్బలు తగిలించుకోవడం ఖాయం. ఇదే విషయాన్ని ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలా తన దైన తీరులో సత్తి చెప్పిన విధానం ఆకట్టుకుంది. సత్తి విసిరిన వాగ్బాణాలు ప్రభుత్వానికి సూటిగా గుచ్చుకుంటాయి. రోడ్లపై ఉన్నగుంతలు అంతరిక్షంలో చంద్రుణ్నిపోలి ఉన్నాయని, ఒక వ్యామగామిలా నడవాల్సి వస్తుందని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చేసిన వీడియో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీన్నే సత్తి తనదైన స్టైల్‌ల్లో ప్రజెంట్ చేశాడు.

Follow Us
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డ్యాన్స్..తేడా వస్తే డైరెక్ట్‌ యమలోకమే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
మంచి భార్య రావడానికి శ్రావణ మాసంలో అబ్బాయిలు చేయాల్సిన వ్రతం ఇదే!
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
గేదే పాల కంటే 100 రెట్లు బలం.. ఇలా తాగితే ఎముకలు ఉక్కులా
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
నీట్ విద్యార్థులకు మరో ఛాన్స్.. MBBS, BDS అడ్మిషన్ల గడువు పెంపు!
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..
బంగారం, వెండి కాదు.. రాబోయే రోజుల్లో ఈ లోహనిదే క్రేజ్..
RC ఇంట్లో మర్చిపోయారా? చలాన్ తప్పదా..! అసలు రూల్ ఇదే!
RC ఇంట్లో మర్చిపోయారా? చలాన్ తప్పదా..! అసలు రూల్ ఇదే!
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి!
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తరలించండి!
శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. 9 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా..?
శ్రీలంక ముందు భారీ లక్ష్యం.. 9 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా..?
త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి
త్వరలో రాజభోగాలు పట్టే రాశులివే..! కష్టాల నుంచి విముక్తి
తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిన వేళ.. ముగ్గురు బిడ్డలు ఒకేసారి..
తల్లిదండ్రులు గర్వంతో ఉప్పొంగిన వేళ.. ముగ్గురు బిడ్డలు ఒకేసారి..