అక్కలపై బాలీవుడ్ హీరో వినూత్న ప్రేమ.. నెటిజన్లు ఫిదా

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్ అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. వీరిలో సోనమ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. రియా నిర్మాతగా మంచి పేరును తెచ్చుకుంది. హర్షవర్ధన్ కపూర్ హీరోగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్నాడు. అయితే సినిమాను పక్కనపెడితే వీరందరూ ఫ్యామిలీ రిలేషన్స్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్ని హర్షవర్ధన్ కపూర్ తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన అక్కలు సోనమ్, రియా పేర్లను ఒక్కో భుజంపై పచ్చబొట్టుతో వేయించుకున్నాడు […]

అక్కలపై బాలీవుడ్ హీరో వినూత్న ప్రేమ.. నెటిజన్లు ఫిదా
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 10:22 AM

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కు సోనమ్ కపూర్, రియా కపూర్, హర్షవర్ధన్ కపూర్ అనే ముగ్గురు పిల్లలున్న విషయం తెలిసిందే. వీరిలో సోనమ్ హీరోయిన్‌గా చేస్తుండగా.. రియా నిర్మాతగా మంచి పేరును తెచ్చుకుంది. హర్షవర్ధన్ కపూర్ హీరోగా ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో నిలదొక్కుకుంటున్నాడు. అయితే సినిమాను పక్కనపెడితే వీరందరూ ఫ్యామిలీ రిలేషన్స్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్ని హర్షవర్ధన్ కపూర్ తాజాగా మరోసారి చాటుకున్నాడు. తన అక్కలు సోనమ్, రియా పేర్లను ఒక్కో భుజంపై పచ్చబొట్టుతో వేయించుకున్నాడు హర్ష. కుడి భుజంపై సోనమ్, ఎడవ భుజంపై రియా పేర్లను పచ్చబొట్టుగా వేయించుకొని ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన అభిమానులు హర్షవర్దన్‌‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నీ సోదరీమణులపై నీ ప్రేమ అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం హర్షవర్ధన్ అభినవ్ బింద్రా బయోపిక్‌లో నటిస్తుండగా.. దుల్కర్ సల్మాన్ సరసన సోనమ్ కపూర్ నటించిన జోయా ఫ్యాక్టరీ విడుదలకు సిద్ధంగా ఉంది.

https://www.instagram.com/p/B15tRH9gjv-/