గ్యాంగ్ లీడర్ స్టోరీ ‘కాపీ పేస్ట్’..? నానికి హెడ్డేఖ్..!
నేచురల్ స్టార్ నాని సినిమాకి ఒక విచిత్రమైన కష్టమొచ్చి పడింది. ఇప్పటికే హీరో గాయపడి, షూటింగ్ ఆగిపోయి ఇక్కట్లో వున్న గ్యాంగ్ లీడర్.. ఇప్పుడు మళ్లీ ఇరకాటంలో పడ్డాడు. కాపీ పేస్ట్ అనే అపవాదు పడకుండా జాగ్రత్త పడ్డం కోసం గ్యాంగ్ లీడర్ ఇంకాస్త కొత్తగా రావాలని ట్రై చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ లీడ్‌లో వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కంటెంట్ మీద నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఫిబ్రవరిలో రిలీజైన గ్యాంగ్ లీడర్ […]

నేచురల్ స్టార్ నాని సినిమాకి ఒక విచిత్రమైన కష్టమొచ్చి పడింది. ఇప్పటికే హీరో గాయపడి, షూటింగ్ ఆగిపోయి ఇక్కట్లో వున్న గ్యాంగ్ లీడర్.. ఇప్పుడు మళ్లీ ఇరకాటంలో పడ్డాడు. కాపీ పేస్ట్ అనే అపవాదు పడకుండా జాగ్రత్త పడ్డం కోసం గ్యాంగ్ లీడర్ ఇంకాస్త కొత్తగా రావాలని ట్రై చేస్తున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ లీడ్‌లో వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కంటెంట్ మీద నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఫిబ్రవరిలో రిలీజైన గ్యాంగ్ లీడర్ టీజర్ కూడా అటువంటి అంచనాల్నే ఇచ్చింది.
అయితే.. ఇటీవలే రిలీజైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీకి.. నానీ ప్లాన్ చేసిన గ్యాంగ్ లీడర్‌కీ పోలికలున్నాయట. కొన్ని సీన్లు ఒకేలా వున్నాయన్న అనుమానమొచ్చింది గ్యాంగ్ లీడర్ మేకర్స్‌కి. ఏజెంట్ సాయి శ్రీనివాస సినిమాలో సెకండాఫ్‌లో రకరకాల మలుపులుంటాయి. ఆ మలుపులు కొన్ని గ్యాంగ్ లీడర్ స్టోరీలోని మలుపులకు దగ్గరి పోలికలున్నాయట.
దీంతో.. స్కెచ్ మార్చే ప్రయత్నంలో వుంది గ్యాంగ్ లీడర్ యూనిట్. ఇప్పటికే షూటింగ్‌లో గాయపడి హీరో రెస్ట్‌లో వున్నాడు. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. ఇప్పుడు కథను, స్క్రీన్ ప్లేని మార్చడమంటే.. ఆషామాషీ కాదు.. ఐనా వర్కవుట్ చేస్తున్నాడు గ్యాంగ్ లీడర్.