AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సరిలేరు నీకెవ్వరు’లో సోల్జర్‌గా మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సైనికుడిగా నటించనున్నాడనేది పాత న్యూసే. సరిలేరు నీకెవ్వరు పేరుతో మహేష్ బాబు కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర.. సోల్జర్. కెరియర్‌లో మొదటిసారిగా మహేష్ బాబు ఇండియాన్ ఆర్మీ గెటప్‌లో కనిపిస్తాడు. షూటింగ్ కూడా ఆర్మీ క్యాంప్‌లోనే మొదలు కానుంది. మహర్షి తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మూవీ.. ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీకి […]

'సరిలేరు నీకెవ్వరు'లో సోల్జర్‌గా మహేష్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 12:19 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు సైనికుడిగా నటించనున్నాడనేది పాత న్యూసే. సరిలేరు నీకెవ్వరు పేరుతో మహేష్ బాబు కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర.. సోల్జర్. కెరియర్‌లో మొదటిసారిగా మహేష్ బాబు ఇండియాన్ ఆర్మీ గెటప్‌లో కనిపిస్తాడు. షూటింగ్ కూడా ఆర్మీ క్యాంప్‌లోనే మొదలు కానుంది.

మహర్షి తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మూవీ.. ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన లొకేషన్లో సినిమా షూట్ చేస్తారు. ఇప్పటికే ఆర్మీ నుంచి పర్మిషన్ వచ్చింది. మరోవైపు, ఈ సినిమాలో సైనికుడి పాత్రలో ఫైటింగ్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక నటించగా, ప్రధాన పాత్రలో ప్రముఖ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది.