‘ఇండియన్ 2’ మళ్ళీ వస్తున్నాడు.!
21 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇండియన్’. దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ను గతేడాది స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. దీంతో ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం విబేధాలన్నీ తొలిగాయని.. దర్శకుడు శంకర్, నిర్మాణ […]

21 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇండియన్’. దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ను గతేడాది స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. దీంతో ఈ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదని వార్తలు వచ్చాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం విబేధాలన్నీ తొలిగాయని.. దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బడ్జెట్ విషయంలో రాజీకి వచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. 2021 సంక్రాంతికి సినిమాని విడుదల చేస్తారట. ఇందులో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
#Indian2 – All issues sorted out @LycaProductions given go ahead to @shankarshanmugh and @ikamalhaasan. Shoot to be resumed from June, Pongal 2021 theatrical release.
— Rajasekar (@sekartweets) May 15, 2019