ఆ విషయంలో నేను దురదృష్టవంతురాలిని: ఐశ్వర్య రాజేశ్
ఆ విషయంలో తాను చాలా దురదృష్టవంతురాలినని డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ చెప్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య రాజేశ్.. తన ప్రేమ, సినిమా గురించి చెప్పుకొచ్చింది. ప్లస్‌టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పిన ఐశ్వర్య.. అది మొదట్లోనే ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని చెప్పింది. ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని, అప్పుడూ తాము విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ప్రేమిస్తే […]

ఆ విషయంలో తాను చాలా దురదృష్టవంతురాలినని డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ చెప్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య రాజేశ్.. తన ప్రేమ, సినిమా గురించి చెప్పుకొచ్చింది. ప్లస్‌టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పిన ఐశ్వర్య.. అది మొదట్లోనే ముగిసిపోయిందని చెప్పుకొచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని చెప్పింది.
ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని, అప్పుడూ తాము విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ప్రేమిస్తే అది కలకాలం సాగాలని తాను అనుకుంటానని.. కానీ బ్రేకప్ అయిన వెంటనే మరొకరిని ప్రేమించడం ఎలా సాధ్యమో అర్థం కావడం లేదని పేర్కొంది. ఒక నటి ప్రేమించడం అన్నది సులభం కాదని, అయినా ప్రేమించడం ఒక మంచి అనుభవాన్ని ఇస్తుందని చెప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. తన సినిమాలపైనే దృష్టి సారిస్తున్నానని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.