భారత్‌లో ఆ వృద్ధుడు గుర్తుపట్టాక కన్నీళ్లు వచ్చాయి: ‘టైటానిక్’ హీరోయిన్‌

టైటానిక్‌.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల ఫేవరెట్ మూవీల లిస్ట్‌లో టైటానిక్‌ కచ్చితంగా ఉంటుంది

  • Tv9 Telugu
  • Publish Date - 7:09 pm, Tue, 28 April 20
భారత్‌లో ఆ వృద్ధుడు గుర్తుపట్టాక కన్నీళ్లు వచ్చాయి: 'టైటానిక్' హీరోయిన్‌

టైటానిక్‌.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రేక్షకుల ఫేవరెట్ మూవీల లిస్ట్‌లో టైటానిక్‌ కచ్చితంగా ఉంటుంది. లియోనార్డ్‌ డికాప్రియో, కేట్‌ విన్స్‌లెట్ కీలక పాత్రల్లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత హీరోయిన్‌ కేట్ విన్స్‌లెట్ భారత్ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా తనకు ఎదురైన ఓ సంఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేట్ అభిమానులతో పంచుకున్నారు.

”టైటానిక్‌ విడుదలైన కొన్ని రోజుల తరువాత నేను భారత్‌కు వెళ్లా. ఆ పర్యటనలో భాగంగా హిమాలయాలను చూద్దామని వెళ్లా. ఆ క్రమంలో నేను బ్యాగ్ తగిలించుకొని నడుస్తున్నా. నా వెనుకే ఓ వృద్ధుడు వస్తున్నాడు. ఆయనకు 85 ఏళ్లకు పైనే ఉంటాయి. అంతేకాదు ఒక కన్ను ఆయనకు సరిగా కనిపించడం లేదు. కానీ నా వంక చూసి.. యూ.. టైటానిక్‌ అన్నాడు. నేను అవును అని చెప్పా. వెంటనే అతను తన చేతిని గుండెలపై పెట్టుకొని థ్యాంక్యూ అన్నాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. ఒక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంత గుర్తింపు తీసుకొచ్చింది అనడానికి అదొక ఉదాహరణ” అని కేట్ పేర్కొన్నారు.

Read This Story Also: తొమ్మిది వేళ్లే ఉన్నాయి.. పదో వేలు ఎలా పోయిందో చెప్పిన భారత క్రికెటర్..!