AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2021 : అవార్డుల పంట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది వీరే.. నామినీస్ ను అనౌన్స్ చేసిన ప్రియాంక, నిక్ జోనస్

ఆస్కార్ 2021 అవార్డుల కార్యక్రమానికి నామినేషన్ అయినా చిత్రాలను అలాగే ఇతర వివరాలను గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ ప్రకటించారు. అయితే దర్శకత్వ విభాగంలో

Oscars 2021 : అవార్డుల పంట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది వీరే.. నామినీస్ ను అనౌన్స్ చేసిన ప్రియాంక, నిక్ జోనస్
Oscar Awards
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2021 | 9:15 PM

Share

Oscars 2021: ఆస్కార్ 2021 అవార్డుల కార్యక్రమానికి నామినేషన్ అయినా చిత్రాలను అలాగే ఇతర వివరాలను గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనస్ ప్రకటించారు. అయితే దర్శకత్వ విభాగంలో మహిళలను పట్టించుకోకపోవడం పై  గత ఏడాది ఆస్కార్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి జాగ్రత్త పడిన నిర్వాహకులు ఎంపిక జరిపారు. చోలే జావో, ఎమరాల్డ్ ఫెన్నెల్ వరుసగా నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ వుమన్ ఉత్తమ డైరెక్టర్ స్లేట్ లో ఉన్నారు.

ఇక చాడ్విక్ బోస్మాన్ నామినేషన్ కాకుండా, ఉత్తమ నటిగా వియోలా డేవిస్ (మా రైన్స్ బ్లాక్ బాటమ్ ), ఆండ్రా డే (ది యునైటెడ్ స్టేట్స్ Vs బిల్లీ హాలిడే ), డేనియల్ కలుయుయా ( జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ), లెస్లీ ఓడమ్ జూనియర్ (వన్ నైట్ ఇన్ మయామి) నామినేషన్ లో ఉన్నారు. ఇక ఉత్తమ సహాయ నటుడిగా లేకిత్ స్టాన్ఫీల్డ్ ( జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సీయ) నామినేట్ అయ్యారు. గత సంవత్సరం క్యాన్సర్‌తో మరణించిన చాడ్విక్ బోస్మాన్ మా రైన్స్ బ్లాక్ బాటమ్ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఆ సినిమా అతని నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రియాంక, నిక్ ప్రకటించిన ఆస్కార్ నామినిస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం

ఫాదర్

జుడాస్ అండ్ బ్లాక్ మెస్సీయ

మాంక్

మినారి

నోమాడ్లాండ్

ప్రామిసింగ్ యంగ్ ఉమెన్

సౌండ్ ఆఫ్ మెటల్

ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7

ఉత్తమ దర్శకుడు

థామస్ వింటర్బర్గ్  (అనెదర్ రౌండ్ )

ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

డేవిడ్ ఫించర్  (మాంక్)

లీ ఐజాక్ చుంగ్ ( మినారి)

క్లోస్ జావో ( నోమాడ్లాండ్)

ఉత్తమ నటి

వియోలా డేవిస్  (మా రైనీస్ బ్లాక్ బాటమ్)

ఆండ్రా డే ( ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలిడే)

వెనెస్సా కిర్బీ (పీసెస్ ఆఫ్ ఎ ఉమెన్)

ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్  (నోమాడ్‌ల్యాండ్)

కారీ ముల్లిగాన్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)

మరిన్ని ఇక్కడ చదవండి : Mosagallu Movie Pre Release Event Live : క్రాస్‌ ఓవర్‌ మూవీతో రానున్న మంచు విష్ణు.. ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్

Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..

SuperStar Krishna : 50 వ‌సంతాలు పూర్తి చేసుకున్న విజ‌య‌కృష్ణ మూవీస్..సూపర్ స్టార్ కృష్ణను సత్కరించిన నరేష్