Actress: మూడో భార్యగా వస్తే.. కారు, బంగ్లా, 10 ఎకరాల భూమి.. 23 ఏళ్ల నటికి ఓ పెద్దాయన నీచమైన ఆఫర్.. చివరకు
లైంగిక వేధింపులకు సంబంధించి 29 ఏళ్ల ఓ స్టార్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన తండ్రి వయసున్న ఓ వీవీఐపీ తనను మూడో భార్యగా రావాలని, అందుకోసం కారు, బంగ్లాతో పాటు నెలకు రూ. 11 లక్షలు ఆఫర్ చేసినట్లు ఆమె చెప్పడం సంచలనం రేపుతోంది.

సినిమా ఇండస్ట్రీలోని వేధింపులకు సంబంధించి ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ నటి ఒక ఇంటర్వ్యూలో ఒక వీవీఐపీ వ్యక్తి బండారాన్ని బయటపెట్టింది. ఒక ధనవంతుడు ఒక ప్రముఖ నటిని భార్యగా చేసుకునేందుకు ఆమెకు ఇల్లు, కారుతో పాటు 10 ఎకరాల భూమితో పాటు నెలకు రూ. 11 లక్షల జీతం ఆఫర్ చేశాడట. ఈ విషయం గురించి సదరు నటినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ బాధితురాలు మరెవరో కాదు మలేషియాకు చెందిన ప్రముఖ నటి, మాజీ అందాల రాణి అమీ నూర్ టినీ . ఒక ధనవంతుడు ఆమెను తన మూడవ భార్యగా చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఆ పెద్ద మనిషి ఆమెకు కోట్ల విలువైన 10 ఎకరాల భూమి, కారు, ఇల్లు, నెలకు రూ.11 లక్షలు ఇస్తానని ఆఫరిచ్చాడని అమీ ఓ ఇంటర్వ్యూలో వాపోయింది.
‘ఆ వ్యక్తి మలేషియాలో చాలా పెద్ద, ప్రభావవంతమైన వ్యక్తి . ఆయనను అందరూ VVIP అని పిలుస్తారు. నా తండ్రి వయసు ఆయనకూ ఉంటుంది. ఇది 2019లో జరిగింది. అప్పటికి నా వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. అందాల పోటీల్లో అదృష్టం పరీక్షించుకుంటున్నాను. స్పాన్సర్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నాకు సాయం చేస్తానన్నాడు. కానీ ఆయనకు మూడో భార్యగా వెళ్లాలని షరతు పెట్టాడు. ఆ ఆఫర్ తనకు చాలా వింతగా, తప్పుగా అనిపించింది. వెంటనే ఆయన దగ్గరి నుంచి వెళ్లిపోయాను. ఆపై దీని గురించి మా అమ్మకు కూడా చెప్పాను’ అని అమీ అప్పటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
మలేషియన్ నటి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
అమీ నూర్ టినీ గురించి చెప్పాలంటే, ఆమె మలేషియాకు చెందిన ప్రతిభావంతులైన నటి. నటిగానే కాకుండా, ఆమె గొప్ప హోస్ట్ కూడా. అనేక టెలివిజన్ షోలలో పాల్గొంది. అందాల పోటీలలో కూడా పాల్గొంది. అమీకి ప్రస్తుతం 29 సంవత్సరాలు. ఆమె ఒక ఎంటర్ ప్రెన్యూర్ కూడా. సొంతంగా సెలూన్ తో పాటు స్పాను నడుపుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




