అండర్ కవర్ లేడీ ఏజెంట్‌గా మారిన బాలీవుడ్ హీరోయిన్.. సమ్మర్లో షూటింగ్ ప్రారంభం !..
బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ కథలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పరిణితి చోప్రా. ప్రస్తుతం సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న
బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ కథలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పరిణితి చోప్రా. ప్రస్తుతం సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. కాగా ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ సినిమా దర్శకుడు రిబు దాస్ గుప్తా తెరకెక్కిస్తున్న లేడీ ఓరియంటెండ్ సినిమాలో ఈ బ్యూటీ నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో పరిణీతి అండర్ కవర్ ఏజెంట్‌గా కనిపించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్గు సంబంధించిన లొకేషన్స్‌ను వెతికే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్. కాగా డైరెక్టర్ రిబూ దాస్ గుప్తా దర్శకత్వంలో పరిణీతి నటిస్తున్న రెండవ చిత్రమిది. డైరెక్టర్ రిబూ దాస్ తెరకెక్కించిన ది గర్ల్ ఆన్ ది ట్రైన్ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది.