కరోనా తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొన్న సీనియర్ హీరో.. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో రాబోతున్న..
గత కొన్ని రోజుల క్రితం కరోనా భారీన పడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు సీనియర్ హీరో రాజశేఖర్. పూలరంగడు,
గత కొన్ని రోజుల క్రితం కరోనా భారీన పడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు సీనియర్ హీరో రాజశేఖర్. పూలరంగడు, ఆహా నా పెళ్లంట చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరీ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో ఈ చిత్రం ఉండనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను యాదగిరి గుట్టలో ప్రారంభమైందని సమాచారం. ప్రస్తుతం ఈ షెడ్యుల్‌లో రాజశేఖర్ సన్నివేశాలను మాత్రమే తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి వికారాబాద్‌లో మొదలు పెట్టనున్నారు. తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. రాజశేఖర్‌తోపాటు పలువురు నటీనటులు కూడా షూటింగ్లో పాల్గొన్నారట. గతంలో గరుడవేగ, కల్కి వంటి సినిమాలలో నటించిన రాజశేఖర్ తర్వాత ఎలాంటి సినిమాలో నటించలేదు. మళ్లీ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం రాజశేఖర్ చాలా ప్రయాత్నాలే చేస్తున్నట్లు టాక్.