Sam Jam: ఆయనంటే నాకెంతో ఇష్టం అంటూ భావోద్వేగానికి గురైన స్టైలిష్ స్టార్… ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన అంటే నాకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ అల్లు అర్జున్‌కి ఎవరంటే ఇష్టం... ఎందుకు భావోద్వేగానికి గురయ్యాడో తెలుసుకుందామా...

Sam Jam: ఆయనంటే నాకెంతో ఇష్టం అంటూ భావోద్వేగానికి గురైన స్టైలిష్ స్టార్... ఎందుకో తెలుసా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 29, 2020 | 5:32 AM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన అంటే నాకెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ అల్లు అర్జున్‌కి ఎవరంటే ఇష్టం… ఎందుకు భావోద్వేగానికి గురయ్యాడో తెలుసుకుందామా…

సామ్ జామ్….

తెలుగు ఓటీటీ ఆహా మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. అయితే ఈ షోలో నటి సమంత అక్కినేని వ్యాఖ్యాతగా సెలబ్రిటీ ఛాట్ షో ‘సామ్ జామ్’ ప్రసారమవుతోంది. తాజాగా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌తో పాటు అల్లు అరవింద్ పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘కొడుకు పుట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది’ అంటూ అల్లు అర్జున్‌ భావోద్వేగానికి లోననైన వీడియోను ఈ షోలో ప్లే చేశారు.

ఆ వీడియోను చూస్తూ… అల్లు అర్జున్, అల్లు అరవింద్, సమంత కంటతడి పెట్టారు. కాగా, షోలో ప్లే చేసిన వీడియో ‘అల వైకుంఠపురములో’ సినిమా సమయంలో అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో అది. అందులో ‘నేను మా నాన్నంత గొప్పవాడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. ఈ ప్రపంచంలోకెల్లా ఆయనంటే నాకెంతో ఇష్టం’ అని ఉద్వేగానికి గురవుతూ మాట్లాడారు. అయితే ఆ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘నూతన సంవత్సరం’ కానుకగా జనవరి 1న ఆహా ఓటీటీ వేదికగా ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు కనులవిందు చేయనుంది.