ఒడిస్సీ డ్యాన్సర్‌గా మారిన కాజోల్.. ఆసక్తికరంగా ‘త్రిభంగా’ టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే..
ప్రస్తుతం కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభం థియేటర్లకు కలిసిరాకపోయిన ఓటీటీలకు మాత్రం
ప్రస్తుతం కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభం థియేటర్లకు కలిసిరాకపోయిన ఓటీటీలకు మాత్రం బాగానే కలిసోచ్చింది. ఇటీవల ఇందులో విడుదలైన వెబ్ సిరీస్‌లు మంచి విజయం సాధించాయి. దీంతో తెలుగు, తమిళ, కన్నడ స్టార్స్‌తోపాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఈ వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజోల్ నటించిన ‘త్రిభంగా’ కూడా ఓటీటీ వేదికపై అలరించనుంది. కాజోల్ భర్త అజయ్ దేవ్‌గణ్ ఆల్కేమీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రేణుక షహాణే దర్శకత్వం వహించారు.
నూతన సంవత్సర కానుగా త్రిభంగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో కాజోల్ ఒడిస్సీ డ్యాన్సర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా గురించి కాజోల్ మాట్లాడుతూ.. ముగ్గురు మహిళలకు సంబంధించిన ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం రాబోతుంది. త్రిభంగా మూవీ ఈ జనవరి నెలలో విడుదలవుతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతోపాటు నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నా అంటూ చెప్పింది. ఇక ఈ నెల 15న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పనులన్ని ముగింపు దశకు చేరుకున్నాయి. ఒకే కుటుంబంలోని మూడు తరాల మహిళల చుట్టూ ఈ కథ ఉంటుందని తెలుస్తోంది.
View this post on Instagram