విలన్‌గా ‘కుమారీ’ పాప..!

విలన్‌గా 'కుమారీ' పాప..!

‘కుమారి 21f’ సినిమాతో.. ఒక్కసారిగా.. యూత్‌ని తనవైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ.. హెబ్బా పటేల్. ఈ సినిమా హిట్‌ తర్వాత.. వరుస సినిమాలు.. ఆమె చుట్టూ క్యూ కట్టాయి. ఇప్పటికి 10 సినిమాలు చేసినా.. ‘కుమారి 21f’ సినిమాకి వచ్చినంత మంచి టాక్‌.. ఏ సినిమాకీ రాలేదు. ఈ నేపథ్యంలో.. ఆమెకు నితిన్‌ సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చింది. అదే నితిన్ ‘భీష్మ’ సినిమా. నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 09, 2019 | 1:34 PM

‘కుమారి 21f’ సినిమాతో.. ఒక్కసారిగా.. యూత్‌ని తనవైపుకు తిప్పుకున్న హాట్ బ్యూటీ.. హెబ్బా పటేల్. ఈ సినిమా హిట్‌ తర్వాత.. వరుస సినిమాలు.. ఆమె చుట్టూ క్యూ కట్టాయి. ఇప్పటికి 10 సినిమాలు చేసినా.. ‘కుమారి 21f’ సినిమాకి వచ్చినంత మంచి టాక్‌.. ఏ సినిమాకీ రాలేదు. ఈ నేపథ్యంలో.. ఆమెకు నితిన్‌ సినిమాలో ఓ మంచి అవకాశం వచ్చింది. అదే నితిన్ ‘భీష్మ’ సినిమా.

నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదట ‘భీష్మ’ను దసరాకి రిలీజ్ చేద్దామనుకున్నా.. అనుకోని కారణాల వల్ల.. డిసెంబర్ నెలకి వాయిదా వేశారు. కాగా.. ఈ సినిమాలో మరో హాట్ బ్యూటీ కూడా నటిస్తోంది ఆమెనే.. హెబ్బా పటేల్. ఈ సినిమాలో.. విలన్‌ రోల్‌ చేస్తుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ రకంగానైనా.. దీంతో.. హిట్ కొట్టాలని చూస్తోంది..హెబ్బా.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu