AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త.. బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది: నాని

న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ది ప్యారడైజ్' ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుంది. మాస్, యాక్షన్ థియేటర్ అదిరిపోయేలా ఉంటుందని, జడల్ లాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలేదు.నా కెరీర్ లోనే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సినిమా ప్యారడైజ్ అని నాని అన్నారు.

తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త.. బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది: నాని
Nani
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 7:01 PM

Share

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నా కెరీర్ స్టార్ట్ అయిందే సెప్టెంబర్ లో. ‘అష్టా చమ్మా’ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా సెప్టెంబర్‌లోనే వచ్చింది. ఇప్పుడు ఆ హిట్ సెంటిమెంట్ ‘ప్యారడైజ్’కి వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నాను.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

జడల్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. కథలో నుంచి వచ్చిన లుక్ అది. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ బాగా రిలేటబుల్‌గా, తెలిసిన ఒక పర్సన్ లాంటి ఫీలింగ్ వచ్చే రోల్స్. ఇందులో క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యుతో చూస్తారు. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్-సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి నాని మాట్లాడుతూ..మేము ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ చేశాం. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హోల్డ్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. వందకి రెండింతలు చేశాడు. శ్రీకాంత్-అనిరుధ్ కిల్లర్ కాంబినేషన్. వాళ్ల వల్లే ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల కట్ట’ లాంటి సాంగ్స్ సాధ్యమయ్యాయి. శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్ బాబు గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. కాకపోతే ఆయన ఈ క్యారెక్టర్ చేస్తారా లేదా అనేది నాకు డౌట్. ఎందుకంటే చాలా నెగిటివ్, బ్రూటల్ క్యారెక్టర్. శ్రీకాంత్ కథ చెప్పడానికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్లాడు. ఆయన చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఈ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. ఇందులో విలన్‌గా ఆయన చేసే కొన్ని పనులు ఉంటాయి. అవన్నీ చూసి ఆడియన్స్ కచ్చితంగా షాక్ అవుతారని నాని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us