‘భీష్మ’లో బోల్డ్ బ్యూటీ!

హైదరాబాద్‌: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. ఈ మధ్య ఆమె చేసిన సినిమాలు వరుస ప్లాప్స్‌ కావడంతో అవకాశాలు చేజార్చుకుంది. 2018లో ’24 కిస్సెస్’ సినిమాతో పలకరించిన ఆమె ఆ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్, వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘బీష్మ’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం హెబ్బాను ఎంపిక చేశారట. నటనకు బాగా ఆస్కారం […]

'భీష్మ'లో బోల్డ్ బ్యూటీ!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 14, 2019 | 6:17 PM

హైదరాబాద్‌: ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. ఈ మధ్య ఆమె చేసిన సినిమాలు వరుస ప్లాప్స్‌ కావడంతో అవకాశాలు చేజార్చుకుంది. 2018లో ’24 కిస్సెస్’ సినిమాతో పలకరించిన ఆమె ఆ తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్, వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘బీష్మ’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం హెబ్బాను ఎంపిక చేశారట. నటనకు బాగా ఆస్కారం ఉన్న పాత్ర అని టాక్. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంతోనైనా హెబ్బాకు ఆశించిన బ్రేక్ దక్కుతుందేమో వేచి చూడాలి.