బిగ్ బాస్‌ హౌస్‌లో అప్పడాల లొల్లి.. సన్నీ, షణ్ముఖ్ మధ్య రాజుకున్న యుద్ధం.. అస్సలు తగ్గేదే..లే!

తెలుగు బిగ్ బాస్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. హౌస్‌లోని కంటెస్టంట్స్‌ మధ్య అసలైన గేమ్ మొదలు కావడంతో.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతోంది..

బిగ్ బాస్‌ హౌస్‌లో అప్పడాల లొల్లి.. సన్నీ, షణ్ముఖ్ మధ్య రాజుకున్న యుద్ధం.. అస్సలు తగ్గేదే..లే!
Bigg Boss
Follow us
Basha Shek

|

Updated on: Nov 12, 2021 | 1:59 PM

తెలుగు బిగ్ బాస్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. హౌస్‌లోని కంటెస్టంట్స్‌ మధ్య అసలైన గేమ్ మొదలు కావడంతో.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరుకుతోంది. ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో సన్నీ, షణ్ముఖ్ మధ్య చిన్న పాటి యుద్ధం జరిగిందనే చెప్పాలి. ఈ వారం కెప్టెన్సీలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టంట్స్‌‌కు ‘టవర్‌లో ఉంది పవర్’ అనే టాస్క్ ఇచ్చాడు. అయితే సన్నీ టాస్క్‌ పూర్తి చేస్తుండగా సిరి మధ్యలో వచ్చి అతడిని అడ్డుకుంటుంది. దీంతో సన్నీ కోపోద్రిక్తుడవతాడు.’ఆటలో ఉన్న వాన్ని పట్టుకోవడమేంటని’ సిరిపై విరుచుకుపడతాడు. దీనికి ‘ఇది నా గేమ్‌ స్ట్రాటజీ’ అని సిరి బదులివ్వగా.. ఇలాగే చేస్తే ‘ తంతాను..అప్పడమైపోద్దీ’ అని సన్నీ మండిపడతాడు. ‘అయితే…వెళ్లి అప్పడాలు అమ్ముకో’ అంటూ సిరి సన్నీని ఎగతాళి చేస్తుంది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుండగానే మధ్యలో షణ్ముఖ్‌ వస్తాడు. సిరికి సపోర్ట్‌గా మాట్లాడతాడు. దీంతో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ రాజుకుంటుంది.

‘నువ్వు సిరిని ఏం చేయలేవు’ అని షణ్ముఖ్‌ అంటే…’ ఏం..సిరిని కొడితే చూడాలని ఉందా.. ఇది చేయడానికి నాకు క్షణం పట్టదు. ఆడపిల్లలను పంపించి మాట్లాడడం కాదు. దమ్ముంటే నీ ఆట నువ్వు ఆడాలి.. ఆడపిల్లల సహాయంతో గేమ్‌ ఆడొద్దు’ అని సన్నీ సమాధానమిస్తాడు. దీంతో షణ్ముఖ్‌ కూడా రెచ్చిపోతాడు. మర్యాదగా మాట్లాడాలంటాడు. ‘నీకెంట్రా…మర్యాద’ అని సన్నీ షణ్ముఖ్‌ను తిడతాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగిపోతుంది. ‘నువ్వు ఎవరిని అప్పడం చేస్తావ్‌’… ‘దమ్ముంటే గేమ్‌లోకి వచ్చి చూడు’ అని పరస్పరం తగవులాడుకుంటారు. హౌస్‌లోని తోటి కంటెస్టెంట్లు ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరి సన్నీ, షణ్ముఖ్ల గొడవ ఎంత దాకా వెళ్లిందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ను చూడండి. అప్పటివరకు ఈ ప్రోమోను చూసి ఆనందించండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Drushyam 2 Movie: థ్రిల్లర్ మూవీ దృశ్యం 2 టీజర్ విడుదల.. అమెజన్‌ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

RGV: ఫిల్మ్ ఇండస్ట్రీలో నయా ట్రెండ్ సెట్ చేస్తున్న ఆర్జీవీ.. మరో మార్కెట్‌కు గేట్లు ఓపెన్..

Kurup: ఏ సినిమాకు దక్కని అవకాశం .. బుర్జ్ ఖలీఫా పై దుల్కర్ సల్మాన్ సినిమా ట్రైలర్