Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ముద్దులొలుకుతున్న ఈ క్యూట్ చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తనే టాప్ హీరోయిన్.. గుర్తుపట్టండి..

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. తను టాప్ హీరోయిన్. ఆ చిన్నారి తండ్రి కూడా స్టార్ హీరో. ప్రస్తుం ఈ క్యూట్ బుజ్జాయి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ అందం, అభినయంతో మెప్పించింది.

Tollywood : ముద్దులొలుకుతున్న ఈ క్యూట్ చిన్నారి ఓ స్టార్ హీరో కూతురు.. ఇప్పుడు తనే టాప్ హీరోయిన్.. గుర్తుపట్టండి..
Bollywood Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2023 | 1:41 PM

ఇప్పుడు సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిత్యం తమ సినిమా అప్డేట్స్ షేర్ చేయడమే కాదు.. అభిమానులతో ముచ్చటిస్తున్నారు. వ్యక్తిగత విషయాలు షేర్ చేయడంతోపాటు.. తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఇక తమ ఫేవరేట్ స్టార్ బాల్యంలో ఎలా ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. తను టాప్ హీరోయిన్. ఆ చిన్నారి తండ్రి కూడా స్టార్ హీరో. ప్రస్తుం ఈ క్యూట్ బుజ్జాయి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ అందం, అభినయంతో మెప్పించింది. తన నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటుంది. ఎవరో గుర్తుపట్టారా ?. తనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్. ఈరోజు (August 12) ఆమె పుట్టినరోజు సందర్భంగా సారా చిన్ననాటి ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తూ ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. 12 ఆగస్ట్ 1995న జన్మించిన సారా.. 4 ఏళ్ల వయసులోనే ఓ యాడ్ చేసింది సారా. టీనేజ్ లో ఉన్నప్పుడు సారా చాలా లావుగా ఉండేది. ఆ సమయంలో తను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యతో బాధపడింది. 2016లో తన గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే.. కొలంబియాలో వెయిట్ లాస్ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 2018 లో కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సారా.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.

కేదార్ నాథ్ మూవీ తర్వాత రణ్వీర్ సింగ్ సరసన సింబా చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా తర్వాత లవ్ ఆజ్ కల్, కూలీ నం.1, ఆత్రంగి రే వంటి చిత్రాల్లో నటించింది. సారా కెరీర్ లో ఆత్రంగి రే చిత్రం వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించారు. ఇటీవలే జరా హాట్కే జరా బచ్కే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో విక్కీ కౌశల్, సారా నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం సారా చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.