Sachin Joshi: సచిన్ జోషిపై కేసు నమోదు.. ఫిర్యాదు చేసిన అతడి స్నేహితుడు.. ఎందుకు ఇలా చేశాడంటే..
Sachin Joshi: హీరో సచిన్ జోషిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.
Sachin Joshi: హీరో సచిన్ జోషిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. బిజినెస్ విషయంలో సచిన్ జోషి ఇటీవల సమస్యలు ఎదుర్కొంటున్నాడు. దీంతో సకాలంలో కొన్ని చెల్లింపులు చేయక కేసులో ఇరుక్కున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ రిసార్ట్ కోరేగావ్ పార్కుకు రూ. 58 కోట్ల రూపాయల రాయల్టీ చెల్లించలేదని ఆరోపిస్తూ ముంబైకి చెందిన పరాగ్ సంఘ్వి పుణెలోని చతుశృంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
వీకింగ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జోషి అండ్ పార్టనర్స్‌తో సంఘ్వి కాంట్రాక్ట్ కుదుర్చుకోగా ఒప్పందం ప్రకారం ప్లే బాయ్ బీర్ గార్డెన్ ఫ్రాంచైజ్‌కు చెందిన కోరెగావ్ పార్క్‌కు సచిన్ జోషి రాయాల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ 2016 నుంచి సచిన్ పేమెంట్ చేయడం లేదని ఆరోపించిన సంఘ్వి ఈ విషయంపై అప్పుడే పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్‌కు చెందిన వీకింగ్ కంపెనీ జీతాలు చెల్లించడం లేదంటూ గతంలోనూ ఆరోపణలు వెలువడ్డాయి. అంతేకాదు, టాలీవుడ్ డ్రగ్స్ కేసు కుంభకోణంలోనూ సచిన్ జోషి పేరు వినపడిన సంగతి తెలిసిందే.
Esha Deol: ఆ బాలీవుడ్ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది.. దీంతో ఆమె ఏం చేసిందంటే..
Mbbs Counselling: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్.. నోటిఫికేషన్ జారీచేసిన..